
స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థల ఆందోళనలను, సమస్యలను పరిష్కరించేందుకు వాటితో నెలవారీ సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు సూచనలు చేసినట్లు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రేజర్‌పే, క్రెడ్, పీక్‌ఫిఫ్టీన్ తదితర 50 సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు.
ప్రభుత్వం తరఫున ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి, డీపీఐఐటీ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తదితరులు, ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ ఖారా, ఎన్‌పీసీఐ అధికారులు హాజరయ్యారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ఆర్‌బీఐ ఆంక్షల కొరడా ఝుళిపించిన తరుణంలో ఫిన్‌టెక్, స్టార్టప్‌లతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పీపీబీఎల్ ఉదంతంపరమైన ఆందోళనలేమీ అంకుర సంస్థల వ్యవస్థాపకుల్లో కనిపించలేదని అధికారి తెలిపారు. ఈ భేటీలో స్టార్టప్‌లు సైబర్‌సెక్యూరిటీ సంబంధ అంశాలను ప్రస్తావించినట్లు వివరించారు.
మహాకుంభ్‌లో వెయ్యి అంకుర సంస్థలు..
మార్చి 18 నుంచి న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో 1,000 పైచిలుకు అంకుర సంస్థలు, పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు, ఇన్‌క్యుబేటర్లు పాల్గొననున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభా గం డీపీఐఐటీ నిర్వహించనుంది. పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చలు, మెంటార్ సెషన్లు, మాస్టర్‌క్లాస్‌లు, కీలకోపన్యాసాలు, యూనికార్న్ రౌండ్‌టేబుల్ సమావేశాలు మొదలైనవి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment