మండల ప్రత్యేక అధికారులు ఇకనుంచి ప్రతి శుక్రవారం మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ప్రద్యుమ్న ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక సమావేశాలు శుక్రవారం
Published Mon, Sep 2 2013 2:39 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
ఆర్మూర్‌రూరల్, న్యూస్‌లైన్: మండల ప్రత్యేక అధికారులు ఇకనుంచి ప్రతి శుక్రవారం మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ప్రద్యుమ్న ఉత్తర్వులు జారీ చేశారు. గత కలెక్టర్ క్రిస్టీనా హయాంలో ప్రతి సోమవారం ఈ సమావేశాలు ఉండేవి. సోమవారం అన్ని కార్యాలయాలలో పనులు, అధికారులను ప్రజలు వచ్చి కలిసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రదుమ్న సమావేశాల నిర్వహణకు ఈ మార్పు చేశారు.
మండల పరిషత్ కార్యాలయాలలో తహశీల్దార్, ఎంపీడీవో, విద్యుత్ ఏఈ, మండల వ్యవసాయాధికారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, పంచాయితీరాజ్ ఏఈ, మండల పశువైద్యాధికారి, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, మండల విద్యాధికారి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, ఈవోపీఆర్‌డీ, హౌసింగ్ ఏఈలతో మండల ప్రత్యేకాధికారులు ఆయా శాఖల పనితీరుపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మండలంలోని సమస్యలు, కొనసాగుతున్న పనులు, పెం డింగ్‌లో ఉన్న పనులు, తదితర వాటిపై చర్చిం చాలన్నారు.
సమావేశాల వివరాలు, గ్రామస్థాయిలో పర్యటించిన వివరాలను ఆదే రోజు ఈ మెయిల్, ఫ్యాక్స్ ద్వారా జిల్లా పరిషత్ సీఈవోకు పంపించాలని సూచించారు.
హాజరవుతారా ?
గతంలో నిర్వహించే సమీక్ష సమావేశాలకు అధిక శాతం మండలస్థాయి అధికారులు గైర్హాజరయ్యే వారు. వీరిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో మండల ప్రత్యేకాధికారి ఎన్ని సార్లు చెప్పిన ఫలితం లేకుండా పోయింది. దీంతో మండల ప్రత్యేకాధికారి నిర్వహించే సమావేశాలలో ఒకరిద్దరు అధికారులు మాత్రమే పాల్గొనే వారు.
Advertisement
Advertisement