రిలయన్స్‌ వాటాదారులకు కూడా ఓ కానుక | Reliance Industries Chairman Mukesh Ambani Announces 1:1 Bonus Issue | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ వాటాదారులకు కూడా ఓ కానుక

Jul 21 2017 1:46 PM | Updated on Sep 5 2017 4:34 PM

రిలయన్స్‌ వాటాదారులకు కూడా ఓ కానుక

రిలయన్స్‌ వాటాదారులకు కూడా ఓ కానుక

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 40వ వార్షికోత్సవం సందర్భంగా వాటాదారులకు బోనస్‌ ఆఫర్‌ ప్రకటించింది.

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  40వ వార్షికోత్సవం సందర్భంగా వాటాదారులకు బోనస్‌ ఆఫర్‌ ప్రకటించింది. జియో వినియోగదారులకు    జియో ఫోన్‌ ద్వారా  బంపర్‌ ఆఫర్లతో పాటు వాటాదారులకు కూడా తీపి కబురు అందించారు  రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ.

శుక్రవారం నాటి  వార్షిక సాధారణ సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ బోనస్ షేర్లను షేర్ల హోల్డర్స్‌కు  బహుమతిగా  ప్రకటించారు.  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాటాదారులకు  1: 1 బోనస్‌ ప్రకటించారు. దీని ప్రకారం  ప్రతి షేరుకు  అదనంగా  ఒక షేర్‌ బోనస్‌గా లభించనుంది.   దీంతో రిలయన్స్ షేరు  3.19 శాతం లాభపడి 1,578 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన ప్రసంగంలో 1977 లో నుంచి  రిలయన్స్ షేర్లలో రూ .1,000 పెట్టుబడికి గాను  దీని విలువ రూ. 16.5 లక్షలకు చేరుకుందని ప్రకటించారు.  రూ .5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్   మార్కెట్‌ క్యాప్‌లో భారతదేశంలో  అతిపెద్ద కంపెనీగా అవతరించిందని వెల్లడించారు. ముఖ్యంగా  ఏజీఎం సందర్భంగా  జియో  4 జీ ఫీచర్‌ ఫోన్‌ ను ఆవిష్కరించారు. ఉచిత వాయిస్‌ సేవలతోపాటు  నెలకు రూ.153లకు డేటా సేవలను ఉచితంగా అందించనున్నామని  తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement