హై గవర్నెన్స్ ప్రమాణాలను పునరుద్ధరిస్తాం!
న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా ఇన్ఫోసిస్ బోర్డులో నెలకొన్న వివాదం, సంక్షోభం నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవహరాలను చక్క దిద్దే పనిలో పడింది. ఈ మేరకు శుక్రవారం ఇన్ఫోసిస్ సంస్థ అధికారికంగా ఒకప్రకటన జారీ చేసింది. సంస్థలో అత్యున్నత విలువలను కాపాడుతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణపై వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. ఫౌండర్స్ మాజీ బోర్డు సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలను తొలగించి , లోపించిన గవర్నెన్స్ పునరుద్ధరిస్తామని చెప్పింది. హై గవర్నెన్స్ ప్రమాణాలను పాటించనున్నట్టు తెలిపింది.
200 మిలియన్‌డాలర్ల పనయా ఒప్పందం, మాజీ ఎగ్జిక్యూటివ్ లకుచెలించిన అత్యధిక వేతన ప్యాకేజీల తదితర ఆరోపణలపై ఎన్.ఆర్ నారాయణ మూర్తి నేతృత్వంలోని వ్యవస్థాపకులు ఆరోపణలుతో ఇన్ఫీలోవివాదం రాజుకుంది. చిలికి చిలికి గాలివానలా మారి చివరికి ఆగష్టు 18 న, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సికా తన పదవి నుంచి తప్పుకున్నారు. ఒక వారం తరువాత ఆగస్టు 24 న ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు మాజీ ఫౌండర్ నందన్ నీలేకని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రంగంలోకి దిగారు. దీంతో ఛైర్మన్ శేషసాయి, మరో ముగ్గురు డైరెక్టర్లు బోర్డు నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే.