ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూసుకుపోతుంది. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు స్టార్టప్ లైట్‌ఇయర్ వన్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం ఫిన్లాండ్‌కు చెందిన వాల్మెట్ ఆటోమోటివ్‌ను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలు తొలి సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను రూపోందించనున్నాయి. ఈ భాగస్వామ్యంతో 2022 జనవరి వరకు ప్రోటోటైప్ వాహనాల నిర్మాణం జరుగుతుందని కంపెనీ భావిస్తోంది. నెదర్లాండ్స్‌లో కూడా లైట్‌ఇయర్ ఉంది. ఈ కంపెనీ తయారుచేసిన ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 724.2 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వనుంది.
బ్రిడ్జ్‌స్టోన్ వంటి కంపెనీలతో లైట్‌ఇయర్ వన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పటికే లైట్‌ఇయర్ వన్ 60 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్, 3.5 కిలో వాట్ల సోలార్ ప్యానెల్స్‌తో 710 కిలోమీటర్ల స్థిరమైన రేంజ్‌ను అందిస్తోన్నట్లు రుజువు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ రెండో ప్రోటోటైప్ కార్‌ను సిద్ధంచేయాలని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా పరిమిత స్థాయిలో లైట్ ఇయర్ వన్ ఎస్‌ఈవీ(సోలార్ ఎలక్ట్రిక్ వెహికిల్) ఉత్పత్తికి కంపెనీ చర్యలు తీసుకుంటుంది. వాల్మెట్ భాగస్వామ్యంలో ఎస్‌ఈవీ వాహనాల ఉత్పత్తి మరింత వేగం కానుందని కంపెనీ పేర్కొంది.
వాల్మెట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సుమారు 50 సంవత్సరాలకు పైగా కాంట్రాక్ట్ తయారీదారుగా ఉంది. మెర్సిడెస్ బెంజ్, పోర్స్చే వంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఫిన్లాండ్‌లో వాల్మెట్ ఆటోమోటివ్ స్వంత బ్యాటరీ తయారీ పరిశ్రమను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment