సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాని అమలుదిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని గతంలోనే ప్రారంభించింది.
ఈ మేరకు లబ్ధిదారులు సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రూ.78వేలు ఇవ్వనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ పథకానికి కేబినెట్ ఆమోదం లభించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువరించనున్నట్లు సమాచారం.
పీఎం సూర్య ఘర్ పథకాన్ని రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్నారు. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని గతంలోనే తెలియజేశారు.
ఇదీ చదవండి: వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే..
రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment