ఫ్యాషన్ పథ్
ఢిల్లీలో బాగా తెలిసిన వీధులు జన్‌పథ్.. రాజ్‌పథ్. రెండూ ఒక కూడలిలో కలుస్తాయి. రారాజులు నడిచిన, జనం నడిచిన మార్గాలు ఇవి. అదిగో అక్కడే సమ్మర్‌లో కూల్, సింపుల్, స్టైలిష్, స్మార్ట్ ఫ్యాషన్ కలగలుస్తాయి ఇదిగో, ఢిల్లీ నుంచి మన గల్లీకి ఫ్యాషన్ పథ్!!
►లాంగ్ స్లీవ్స్ కాటన్ గౌన్. జీన్స్ మీదకు మిడ్ స్లీవ్స్ ట్యూనిక్.. వేసవికి సౌకర్యవంతమైన డ్రెస్‌లు.
►సింగిల్ షోల్డర్ ట్యూనిక్ లూజ్ సల్వార్ ప్యాంట్ ఓ కంఫర్ట్.
►కలంకారీ ట్యూనిక్ కాటన్ ట్రౌజర్ వేసవికి కంఫర్ట్ స్టైల్.
►టైట్‌ఫిట్ ట్యూనిక్, స్టైలిష్ మిడ్ ప్యాంట్ విత్ ఓవర్‌కోట్ సరైన కాంబినేషన్.
►కాటన్ స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్, లూజ్ ప్యాంట్ స్టైలిష్ కంఫర్ట్.
►లాంగ్ స్కర్ట్‌పై కాటన్ టీ షర్ట్ లేదా ట్యూనిక్ ధరిస్తే స్మార్ట్ స్టైల్ మార్కులు కొట్టేస్తారు.
►జీన్స్ మీదకు లాంగ్ కలర్‌ఫుల్ కాటన్ టాప్ ఆల్‌టైమ్ ఫ్యాషన్ డ్రెస్.
►పలాజో మీదకు లాంగ్ మ్యాక్సీ గౌన్, ఆ పైన స్లీవ్‌లెస్ ఓవర్‌కోట్ కంఫర్ట్ లుక్.
►సింపుల్ అండ్ స్మార్ట్ లుక్ సింగిల్ పీస్ మ్యాక్సీ డ్రెస్.
►వైట్ స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్, పలాజో ప్యాంట్ బెస్ట్ ఛాయిస్.