సాక్షి, సిటీబ్యూరో : హాట్‌హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఉండాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది.. కానీ తప్పదు.. శరీరాన్ని వేడి నుంచి రక్షించుకోవడంలో దుస్తులూ ప్రముఖ పాత్ర వహిస్తాయి. వేసవిలో కలర్ ‘ఫుల్’ దుస్తులకు కాస్త దూరంగా ఉండి శరీరానికి చల్లదనాన్ని అందించే ఫ్యాబ్రిక్స్‌తో తయారైన డ్రెస్సెస్‌ను ప్రిఫర్ చేస్తే హీట్ సమ్మర్‌పై హిట్ కొట్టినట్లేనని ఫ్యాషన్ డిజైనర్లు అంటున్నారు. సో.. ఫ్యాషన్ మార్చిసమ్మర్‌కు కూల్ వెల్‌కమ్ చెబుదాం..
లేత రంగులు బెస్ట్..
ఈ సీజన్‌లో ముదురు రంగు దుస్తులకు బదులు లేత వర్ణంలో ఉండే సమ్మర్ ఫ్రెండ్లీ దుస్తుల వైపు మొగ్గు చూపడం మంచిది. నలుపు, ఎరుపు, ముదురు నీలం తదితర రంగులను వేసవిలో ప్రిఫర్ చేస్తే అవి వేడి పుట్టిస్తాయి. అందుకు వీలైనంత వరకు పింక్, లైట్ బ్లూ, వైట్, క్రీమ్, లెమన్ ఎల్లో తదితర లేత రంగులు ధరించడమే మంచిదని ఫ్యాషన్ డిజైనర్లు చెబుతున్నారు.
కంఫర్ట్.. బాడీ ఫ్రెండ్లీ..
సమ్మర్ ఫ్యాషన్ వేర్‌లో విభిన్న డిజైన్లు, ఆకట్టుకునే రంగుల్లో రూ.500 నుంచి రూ.15,000 ధరల్లో దుస్తులు అందుబాటులో ఉన్నాయి. లెంగ్త్ ఫ్రాక్స్, కోల్డ్ షోల్డర్స్, పాప్ స్టైల్ వెస్ట్ స్కర్ట్స్, హై కట్ టాప్స్, ట్యాంక్ డ్రస్, ఫెమ్మీ ఫ్లోరల్ లాంగ్ స్కర్ట్స్, ప్రామ్ చూడీస్ మొదలైన పాటర్న్‌లు ఈ సీసన్‌లో బాడీ ఫ్రెండ్లీగా ఉంటూ కావాల్సిన కంఫర్ట్‌ని అందిస్తాయి.
ఒంటికి పట్టేసే దుస్తులతో ఇబ్బంది
సమ్మర్‌లో వదులుగా ఉండే దుస్తులు ధరించటం మంచిది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ, ఒంటికి పట్టేసే దుస్తులు వేయడం మానుకోకపోతే మరింత అసౌకర్యం కలగడంతో పాటు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. భారీ ఇయర్ టాప్స్, బాడీ జ్యూవెలరీ వంటి యాక్సిసరీస్‌ను వీలైనంత వరకు తగ్గించటం మంచిది. – అఖిలేష్, (ఏ అండ్ కే లేబిల్ ఫ్యాషన్ డిజైనర్స్)
Comments
Please login to add a commentAdd a comment