చెక్స్, ప్లెయిడ్, చెకర్ ప్లెయిడ్.. ఇలా ఆధునికుల నోట ఎలా వినిపించినా మనకు ‘చారల చొక్కా, గళ్ల లుంగీ’ అంటే ఇట్టే తెలిసిపోతుంది. ఒకప్పుడు మగవారి దుస్తులకే పరిమితమైన చారలు, గడులు ఇప్పుడు మహిళామణుల వార్డ్‌రోబ్‌లోనూ చేరిపోతున్నాయి.
రెడీ టు వేర్: ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం... ఏ వేళ అయినా ఇంటా, బయట ధరించడానికి ‘నేను సిద్ధం’ అన్నట్టు ఉంటాయి ‘చారల’ దుస్తులు. ఏ వయసు వారికైనా నప్పుతూ... లావు- సన్నం, పొడవు-పొట్టి, నలుపు-తెలుపు తేడాలు చూపని ప్రియ నేస్తంగా చెక్స్‌కి పేరొచ్చేసింది.
డిజైనర్ల నేస్తం: బాలీవుడ్ తారల ఫేవరేట్ డిజైనర్‌గా పేరొందిన ప్రముఖ వస్త్ర నిపుణులు సబ్యసాచీ ముఖర్జీ రూపొందించిన వస్త్రశ్రేణులలో ‘నిలువు-అడ్డం చారల’కు ఓ ప్రత్యేకత ఉంది. సంప్రదాయ దుస్తుల్లోనూ, ఆధునిక దుస్తుల్లోనూ బ్రైట్‌గా కనిపించే ఈ డిజైన్‌కు బాలీవుడ్ తార లూ గులామ్‌లవుతుంటారు. ‘ఎరుపు-నలుపు- ఎరుపు చారల డిజైన్లు ఆకట్టుకోవడంలో అన్నింటికన్నా పైన ఉంటాయి’ అంటారు మరో ప్రముఖ డిజైనర్ రితూకుమార్! ‘టీనేజర్స్ లుక్స్‌ను మరింత అధునాతనంగా, ప్రత్యేకంగా చూపించడంలో చెక్స్ కాంబినేషన్స్ బెస్ట్ ఆప్షన్’ అంటున్నారు డిజైనర్లు.
నాడు - నేడు : నాడు-నేడు-రేపు దీర్ఘకాలం ఆధునిక పోకడలు గల ఏకైక ప్రింట్‌గా చెక్స్ ప్యాటర్న్ ఎప్పుడూ చాలా స్టైలిష్‌గా నిలుస్తుంది. అంతేకాదు ఇతర ప్రింట్లనూ కలుపుకుంటూ అందరినీ ఆకట్టుకుంటుంది.
తాజా అనుభూతి: పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఏ వేళ అయినా లుక్ ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ‘చారలు’ పాప్యులర్ అవడానికీ ఇదే ప్రధాన కారణం. పైగా వయసు తగ్గినట్టుగా అనిపిస్తుంది. లావుగా ఉన్నవారు కాస్త సన్నగా కనపడే అవకాశం ఉంది. చారల వస్త్రం త్వరగామురికిగా కనిపించదు. ఏ సాదా వస్త్రంపైన అయినా సులువుగా ఒదిగి పోతుంది. ఇన్ని సౌకర్యాలు ‘చెక్స్ డ్రెస్’కు ఉంటే ఏ వనిత అయినా ఎందుకు కాదంటుంది?
యాక్ససరీస్‌లోనూ ముందంజ
కాలేజీ అమ్మాయిలను కట్టిపడేసే గీతల డిజైన్లు డ్రెస్సులకు మాత్రమే పరిమితం కాలేదు. శిరోజాలకు వాడే బ్యాండ్స్ నుంచి పాదరక్షల వరకూ ‘చార’లే గ్రేస్‌గా నిలుస్తున్నాయి. బ్యాగ్స్, బెల్ట్స్, గాజులు, గోళ్లరంగుల్లోనూ ‘చెక్స్’ చెక్ మని కళ్లను ఆకట్టుకుంటున్నాయి.
చెక్స్ కుర్తీలకు కాలర్ నెక్ డిజైన్ అధునాతనంగానూ, హుందాగానూ కనిపిస్తుంది.
కార్పోరేట్ పని సంస్కృతికి చెక్స్ బాగా నప్పుతాయి.
ఎత్తు తక్కువ ఉన్నవారు చెక్స్ దస్తుల ఎంపికలో నిలువు చారలకే ప్రాధాన్యం ఇవ్వాలి. అడ్డ చారలు, పెద్ద గడులు
ఎత్తును మరింత తక్కువగా చూపిస్తాయి.
నవీన పోకడలను ఇష్టపడేవారు ‘చెక్స్’ ను తమ వేషధారణలో చేర్చడం మేలు. ఎందుకంటే లుక్ స్టైలిష్‌గా మారడానికి చెక్స్ ఏ కాలమైనా బెస్ట్ ఆప్షన్!
సౌకర్యవంతంగా ఉంటూ, డైనమిక్‌గా కనిపించాలంటే సాదా లేత రంగుల డ్రెస్ వేసుకున్నప్పుడు చారల చొక్కాను జాకెట్‌గా పైన ధరించాలి. దీంతో వస్త్రధారణలో ఒక కొత్తదనం వచ్చేస్తుంది.
మగవాళ్ల డ్రెస్సా... అని అదోలా మొహం పెట్టే అమ్మాయిలు సైతం ఈ స్టయిల్‌కి ప్లాట్ అయిపోవడం ఖాయం. చెక్స్ షార్ట్, ప్లెయిన్ కోటు వేస్తే క్లాసిక్ లుక్ మిమ్మల్ని చుట్టేస్తుంది.
క్రీమ్ కలర్ స్లీవ్‌లెస్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరిస్తే పైన బ్లాక్ చారల చొక్కా ఒకటి ధరించండి.
చారల స్కర్ట్ ధరిస్తే తెలుపు ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ ఫర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది.
నోట్: ఏ డ్రెస్ ధరించినా కలర్ కాంబినేషన్స్ దృష్టిలో పెట్టుకోవాలి.
ఫొటోలో చూపినట్టు.. ఒక ప్లెయిన్ సిల్క్ స్కర్ట్, మగవారు ధరించేలాటి చారల చొక్కా వేసుకొని, స్కర్ట్ కలర్ జాకెట్ ధరిస్తే లుక్‌లో ఒక వేగం కనిపిస్తుంది.
సంప్రదాయంలో ఆధునికం చెక్స్ కుర్తీ!
టాప్ టు బాటమ్ ఒకేలాంటి డ్రెస్ ధరిస్తే నడుముకు ఒక చారల బెల్ట్ లేదా మెడలో చారల స్కార్ఫ్ లేదా నడుం కింది భాగాన్ని కప్పి ఉంచేలా చారల క్లాత్‌తో పాటు డ్రెస్సింగ్‌లో అతి కొద్దిగానైనా ‘చెక్స్’ని భాగం చేస్తే లుక్‌లో ఒక కొత్తదనం వచ్చేస్తుంది.
పురుషుల్లా ముస్తాబు అయ్యేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. మంచి ఫిటింగ్ ఉన్న చారల చొక్కా, బాటమ్‌గా జీన్స్ లేదా డెనిమ్ ఫిటెడ్ ప్యాంట్ ధరించి చొక్కా ఇన్‌షర్ట్ వేస్తే చూపరులకు మీ డ్రెస్సింగ్ స్ఫూర్తిగా నిలుస్తుంది.
ఎర్రటి చారల టాప్, బ్లాక్ లెగ్గింగ్ లేదా జెగ్గింగ్ ధరిస్తే చాలు అల్ట్రా మోడ్రన్‌లా అనిపిస్తారు.
ఆడ-మగ, చిన్నా-పెద్దను ఆకట్టుకుంటున్న ‘చారలు’ స్కాట్లాండ్ దేశ సంస్కృతికి అద్దంగా చెబుతారు. క్రీస్తు పూర్వం 1500 కాలంలోనే ఆ దేశస్థుల వేషధారణలో ‘చారలు’ భాగమైనట్టు చరిత్ర చెబుతోంది. బ్రిటన్ రాణి విక్టోరియా ‘చారల’ డిజైన్‌ను ప్రపంచవ్యాప్తం చేశారని ప్రతీతి.
వయసుకు చెక్..!
Published Wed, Jan 29 2014 10:42 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM
Advertisement
Advertisement