నాలుగు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవి చూసింది. సోమవారం ఉదయం మార్కెట్ ఆరంభంతోనే నష్టాల పరంపర మొదలైంది. షాంగైలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న లాక్డౌన్, మార్చిలో దేశీయంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్‌తో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, అంచనాలను అందుకోలేకపోయిన ఐటీ కంపెనీల పనితీరు. ప్రతికూలంగా కదలాడుతున్న అంతర్జాతీయ మార్కెట్ సూచీలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 58,338 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఈరోజు ఉదయం వెయ్యి పాయంట్లు నష్టపోతూ 57,338 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా ఎక్కడా మార్కెట్‌కు ఉత్తేజ పరితే పరిణామాలు చోటు చేసుకోకపోవడంతో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఫలితంగా కొత్త టైం టేబుల్ ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి 1172 పాయింట్లు నష్టంతో 2.01 శాతం క్షీణత నమోదు చేసి 57,166 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ క్లోజయ్యింది. నిఫ్టీ సైతం 302 పాయింట్లు నష్టపోయి 1.73 శాతం క్షీణించింది 17,173 పాయింట్ల దగ్గర ముగిసింది.
ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ రెండు సూచీలు భారీగా నష్టపోవడంతో ఒక్కరోజులోనే రూ. 3.39 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్ షేరు ధర ఒక్క రోజులో 124 రూపాయలు పడిపోవడంతో ఆ కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 48 వేల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. బ్యాంకు నిఫ్టీ సూచీ భారీగా నష్టపోయింది. ఇన్ఫోసిస్ తర్వాత కోటక్‌మహీంద్రా, టెక్ మహీంద్రా షేర్లు కూడా నష్టపోయాయి. ఇంతటి నష్టాల్లో ఎన్టీపీసీ, టాటా స్టీల్, బజాజ్ ఆటో షేర్లు లాభపడ్డాయి.
చదవండి: మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ పెట్టుబడులు, 3.17 కోట్ల కొత్త ఫోలియోలు!
Comments
Please login to add a commentAdd a comment