ముంబై: వరుసగా రెండు రోజుల పాటు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించిన స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నిన్న సాయంత్రం నుంచే అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ రోజు ఉదయం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. మరోవైపు యూఎస్, ఏసియా మార్కెట్ సూచీలు సైతం బలహీనంగా కదలాడుతుండంతో అమ్మకాలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్, అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు మార్కెట్ మొదలైన 20 నిమిషాల్లోనే భారీగా నష్టాలను చవి చూశాయి.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 57,531 పాయింట్లతో మొదలైంది. క్రితం రోజు ముగింపుతో పోల్చితే దాదాపు 400 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైంది. ఆ తర్వాత కూడా అమ్మకాల జోరు కొనసాగడంతో ఉదయం 9:20 గంటల సమయానికి 597 పాయింట్లు నష్టపోయి ఒక శాతం క్షీణత నమోదు చేసి 57,314 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైను ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 186 పాయింట్లు నష్టపోయి 17,206 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment