( ఫైల్ ఫోటో )
ముంబై: స్టాక్ మార్కెట్‌పై బేర్ పట్టు సడలించడం లేదు. గత రెండు రోజులుగా లాభాలతో ప్రారంభమై చివరకు నష్టాల్లో ముగిసిన మార్కెట్.. ఈ రోజయితే ఏకంగా నష్టాలతోనే ట్రేడింగ్ ఆరంభించింది. ఉక్రెయిన్ రష్యాల మధ్య శాంతి చర్చలు కొలిక్కిరాకపోవడం, రష్యా దాడులు ఉదృతం చేయడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. వివిధ దేశాలతో పాటు అనేక ప్రైవేటు సంస్థలు సైతం రష్యాతో సంబంధాలు తెంచేస్తున్నాయి. ఫలితంగా గ్లోబల్ మార్కెట్ సూచీలు పతనం అవుతున్నాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ రోజు ఉదయం 9:17 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 743 పాయింట్లు నష్టపోయి 54,348 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఆరంభం కావడంతోనే నాలుగు వందల పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో పదిహేను నిమిషాలు గడిచే సరికి అదనంగా 300 పాయింట్లకు పైగా కోల్పోయింది. మరోవైపు నిఫ్టీ 238 పాయింట్లు నష్టపోయి 16,249 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. రష్యా ఎఫెక్ట్, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుండటంతో మార్కెట్ వరుసగా నష్టపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment