ముంబై: స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువైపోయింది. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లను శాసించే సత్తా ఉన్న అమెరికా దాని మిత్రపక్షాల కూటమైన నాటో ఏ క్షణమైన యుద్ధరంగంలోకి దిగవచ్చనే వార్తలు ఈక్విటీ మార్కెట్లను కలవరపాటుకు గురి చేశాయి. కరోనాతో మందగించిన మార్కెట్ ఇప్పుడిప్పుడే కుదుటు పడుతున్న దశలో అమెరికా రష్యాలు పోటాపోటీగా మాటల యుద్ధానికి దిగడం ఇన్వెస్టర్లకు చేటు తెచ్చింది. ఈ ఉద్రిక్తల కారణంగా ఇప్పటికే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర వంద డాలర్ల వైపుగా పరుగులు పెడుతోంది. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం సైతం నలభైఏళ్ల గరిష్టానికి చేరుకుంటోంది. దీంతో ఏ క్షణాణ ఏం జరుగుతుందో అనే పరిస్థితి ఏర్పడింది. దీంతో వేచి చూడటం కంటే లాభాలు చేసుకోవడమే మంచిదనే అభిప్రాయం ఇన్వెస్టర్లలో మొదలైంది. అంతే అమెరికా, చైనా, జపాన్, సింగపూర్ ఇలా అని స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మొదలైంది.
ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ఈరోజు మార్కెట్ ప్రారంభం అయి అవడంతోనే సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలను చవి చూశాయి. సాయంత్రం మార్కెట్ ముగిసే వరకు ఇదే ట్రెండ్ కొనసాగింది. ఐటీ, ఫార్మా, ఆటో, మెటల్, ఫైనాన్షియల్ రంగాలు, స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ అని తేడాల లేకుండా అన్ని కంపెనీల్లో అమ్మకాలు కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు 3 శాతం క్షీణించాయి. సోమవారం ఒక్కరోజే సుమారు రూ. 10 వేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయిందిన మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇంకా ఎంత కాలం ఈ అనిశ్చితి కొనసాగుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్‌లో నెలకొన్న ఈ పరిస్థితి కారణంగా ఇటీవల యూనికార్న్ హోదాలు దక్కించుకున్న నైనా, పేటీఎం, జోమాటో కంపెనీలు విలవిలాడుతున్నాయి. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తేబోతున్న ఎల్‌ఐసీ ఐపీవో మీద ఉన్న బజ్ సైతం కరిగిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment