
భారీ లాభాలతో ఆరంభమైన స్టాక్ మార్కెట్లు ట్రేడ్ వార్ భయాలతో నష్టాల్లోకి జారుకున్నాయి.
ముంబై : ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పలు చర్యలతో సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు వెనువెంటనే నష్టాల బాట పట్టాయి. అమెరికా-చైనా ట్రేడ్ వార్ భయాలతో మెటల్ సహా పలు రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆరంభంలో 500 పాయింట్లు పైగా లాభపడిన సెన్సెక్స్ నెగెటివ్ జోన్‌లోకి ఎంటరైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 108 పాయింట్ల నష్టంతో 36,592 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా,ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 10,786 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.