దేశీయ సూచీలు బుధవారం భారీ నష్టాల్లోకి ట్రేడయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మార్కెట్ ముగిసేనాటికి నష్టాల్లో జారుకున్నాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 522 పాయింట్ల మేర నష్టపోయి 64,049వద్దకు చేరింది. కాగా నిఫ్టీ 159 పాయింట్లు కుంగి 19,122కు చేరుకుంది. మార్కెట్లు ఒక్కసారిగా తలకిందులు కావటంతో దేశీయ పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ.15 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది.
ప్రారంభంలో 65,619 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్.. కాసేపటికి నష్టాల్లోకి జారుకుని చివరి వరకు అలాగే కొనసాగించి. నిఫ్టీ 19286 వద్ద ప్రారంభమయింది. ఒకానొక సమయానికి 19074కు చేరుకుంది. చివరకు 19122 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.174గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, మారుతీసుజుకీ, నెస్లే మిగతా అన్ని స్టాక్‌లు నష్టపోయాయి.
ఇజ్రాయెల్-హమాస్ వివాదం కారణంగా ఉత్పన్నమయ్యే అనిశ్చితి మార్కెట్లపై ప్రభావం చూపుతూనే ఉంది. దాంతో బుధవారం భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు కుదేలయ్యాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం కనిష్ఠ స్థాయికి చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా మార్కెట్లు బలహీనంగా మారాయి. దాంతో మదుపర్లు అమ్మకాలకు పూనుకున్నారు. ఈ పరిస్థితులపై కొంత స్పష్టత వచ్చే వరకు పెట్టుబడిదారులు మార్కెట్‌ను జాగ్రత్తగా పరిశీలించే అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి. నెలవారి డెరివేటివ్‌ల ముగింపునకు రేపు చివరితేది కావడంతో కూడా మార్కెట్లు నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment