భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 19,100 దిగువకు చేరింది. సెన్సెక్స్ 237.72 పాయింట్లు లేదా 0.37 శాతం క్షీణించి 63,874.93 వద్ద, నిఫ్టీ 61.30 పాయింట్లు లేదా 0.32 శాతం క్షీణించి 19,079.60 వద్ద స్థిరపడ్డాయి.
ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ ముగిసే వరకు అదే తంతు కొనసాగించింది. అంతకుముందు గడిచిన రెండు సెషన్‌ల్లో మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగుతుండడంతో మదుపర్లు కొంత జాగ్రత్త వహిస్తున్నారు. దాంతో మంగళవారం మార్కెట్లో లాభాలు స్వీకరించినట్లు తెలుస్తుంది. రియాల్టీ మినహా అన్ని రంగాల షేర్లల్లో అమ్మకాలు కొనసాగాయి.
నిఫ్టీలో ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, ఎల్‌టీ మైండ్‌ట్రీ, ఓఎన్‌జీసీ అత్యధికంగా నష్టపోయాయి. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో స్థిరపడ్డాయి. సెక్టార్ వారీగా అయితే మాత్రం రియాల్టీ మినహా ఆటో, బ్యాంక్, హెల్త్‌కేర్ విభాగాల్లోని అత్యధిక స్టాక్‌లు ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment