దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమై మార్కెట్ ముగిసే సమయానికి పుంజుకుని లాభాల్లోకి చేరుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 330 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 257 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 33 పాయింట్ల లాభంతో వారం మెుదటి రోజు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి.
మార్కెట్‌లో వచ్చే తాత్కాలిక ర్యాలీ నిత్యం కొనసాగుతుందని భావించకూడదు. మార్కెట్లు గత వారం బాగా పడిపోవడంతో గతంతో పోలిస్తే స్టాక్‌లు కొంత డిస్కౌంట్‌లో దొరుకుతున్నాయని భావన ఉంటుంది. కానీ కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు కార్యాచరణ తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అయితే ఏడాది చివరి నాటికి కూడా నిఫ్టీ మళ్లీ 20,000 పాయింట్ల కంటే దాటదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లు పశ్చిమాసియా వివాదానికి సంబంధించిన సంఘర్షణలను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు తీవ్రం అవుతుంటే మాత్రం ఆ ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది.
సోమవారం మార్కెట్లు రికవరీ కావటంతో ఇన్వెస్టర్ల సంపద పెరిగింది. ఈ క్రమంలో రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, ఓఎన్జీసీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఎల్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, నెస్లే, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కదలాడాయి.
యూపీఎల్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఐటీసీ, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, హెచ్యూఎల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో పయనించాయి.
Comments
Please login to add a commentAdd a comment