market analyst
-
స్టాక్ మార్కెట్లో చేయాల్సినవి.. చేయకూడనివి!
స్టాక్ మార్కెట్‌ను ఎలాంటి కష్టం లేకుండా డబ్బు సంపాదించే మార్గంగా చాలా మంది భావిస్తుంటారు. ఇందులో కొంతవరకు వాస్తవం లేకపోలేదు. కానీ, ఫ్రీగా డబ్బులు రావన్న విషయాన్ని మాత్రం విస్మరించకూడదు. గతంలో స్టాక్ మార్కెట్ లావాదేవీలన్నీ కాగితాల మీదే జరిగేవి. ఒక షేర్ కొనాలన్నా, అమ్మలన్నా పెద్ద తతంగమే ఉండేది. పైగా ఆ షేర్లు మన అకౌంట్లో జమ అయ్యేందుకు రోజులే పట్టేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాంతో ట్రేడింగ్ చాలా సులువైంది. అరచేతిలో క్షణాల్లో స్టాక్స్ అమ్మడం, కొనడం జరిగిపోతుంది. కానీ గతంలో స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వ్యక్తులు డబ్బు పోగుట్టుకున్నా అనుభవం గడించేవారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్..?ఎవరో చెప్పారని, యూట్యూబ్‌లో ఏదో వీడియోలు చూశామని స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్నారు. దాంతో మార్కెట్‌పై నిందలేస్తూ, ఇదో జూదమని, గ్యాంబ్లింగని స్టాక్ మార్కెట్ నుంచి విరమించుకుంటున్నారు. సరైన అవగాహన పెంపొందించుకోకుండా మార్కెట్లోకి ప్రవేశించి చేతులు కాల్చుకుని మార్కెట్‌ను నిందించడం సరికాదు. మార్కెట్లోకి రావాలనుకునేవారు, ఇప్పటికే వచ్చినవారు ముందుగా అవగాహన పెంచుకోవాలి. కేవలం స్టాక్స్‌లోనే కాకుండా ఇండెక్స్‌లు, మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటి ఎన్నో మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్స్ కొనాలంటే ఎలాంటి సమయంలో తీసుకోవాలి.. ఎందుకు వాటినే ఎంచుకోవాలి.. వాల్యుయేషన్ల మాటేంటి.. త్రైమాసిక ఫలితాలు ఎలా ఉన్నాయి.. కంపెనీ కాన్ఫరెన్స్‌కాల్‌లో ఏం చెబుతున్నారు.. భవిష్యత్తు ప్రణాళికలేంటి.. వంటి ఎన్నో అంశాలను పరిగణించాలి. మార్కెట్లో ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని కొన్ని అంశాలను పరిశీలిద్దాం.ఇలా చేయొద్దుఅవగాహన లేనప్పుడు ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి.ఇన్స్టంట్ మనీ కోసం తాపత్రయపడకండి.పెట్టిన గంటలోనో, ఒక రోజులోనో లాభాలు వచ్చేయాలని ఆశించకండి.ట్రేడింగ్‌లో లాభాలతో పోలిస్తే నష్టపోయేది ఎక్కువ. కాబట్టి దానిపై పూర్తి పరిజ్ఞానం లేకుండా డబ్బులతో ప్రయోగాలు చేయకండి.సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యక్తులు ఊదరగొట్టే సిఫారసులు చూసి మీ కష్టార్జితంతో చెలగాటమాడుతారు. వారి మాటలు నమ్మకండి.‘మీరు ట్రేడింగ్ చేస్తున్నారా..’ అంటూ ఫోన్ కాల్స్ చేసి మీకు సిఫారసులు అందిస్తాం.. అనేవాళ్లను నమ్మకూడదు.ఏ పని చేసిన మీపై ఆధారపడి కుటుంబం ఉందనే విషయాన్ని మరవకూడదు.ఇదీ చదవండి: ‘వాతావరణ మార్పునకు ఈవీలు పరిష్కారం కాదు’ఇలా చేయండిముందు స్టాక్ మార్కెట్ మీద ఉన్న అపోహలు, భయాలను వదిలేయండి.స్టాక్ మార్కెట్ అంటే నష్టాలు తెచ్చిపెట్టే ఓ జటిల పదార్ధంగా భావించకుండా సిరులు కురిపించే సాధనంగా చూడటం నేర్చుకోండి.మార్కెట్‌పై అవగాహన పెంచుకోండి.రియల్‌టైమ్‌లో పేపర్ట్రేడ్ చేస్తూ క్రమంగా పట్టు సాధించండి.మీ దగ్గర ఎంత డబ్బున్నా ప్రారంభంలో ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి. ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి పెట్టండి.ట్రేడింగ్ వేరు.. ఇన్వెస్ట్మెంట్ వేరనే విషయాన్ని నిత్యం గుర్తుంచుకోండి.మీ పెట్టుబడును దీర్ఘకాలం కొనసాగించేలా ప్రయత్నించండి.బ్యాంకులో ఎఫ్డీ చేసినపుడు ఏడాది, రెండేళ్లు, ఐదేళ్లు ఎలా వేచిస్తున్నారో..అలాగే మార్కెట్లోనూ ఓపిగ్గా ఉండండి.స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫండమెంటల్స్ బాగున్నా షేర్లను ఎంచుకోండి.తాత్కాలిక ఒడిదొడుకులు ఎదురైనప్పుడు ఈ షేర్లు పడినట్లు కనిపించినా, భవిష్యత్‌లో ఇవి మంచి రాబడులు అందిస్తాయి.మార్కెట్ పడిన ప్రతిసారీ కొంత మొత్తంలో షేర్స్ కొనేలా ప్లాన్ చేసుకోండి. దానివల్ల మీకంటూ ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ అవుతుంది.డిపాజిట్లు వంటి సంప్రదాయ పెట్టుబడులతో పోలిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అధిక రాబడులనే ఇస్తాయి. కానీ సరైన అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం.- బెహరా శ్రీనివాసరావు, మార్కెట్ విశ్లేషకులు -
IPO Listing: ఎంట్రీతోనే అదరగొట్టిన ఐపీవో
-
వచ్చేవారం స్టాక్‌మార్కెట్ సూచీలు ఎలా ఉంటాయంటే..?
వచ్చే వారంలో మార్కెట్ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. గతవారంలో ఒడుదొడుకులకు లోనయిన స్టాక్‌మార్కెట్లు పుంజుకుంటాయా? లేదా ఇంకా పడుతాయా..యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ ఎలా ఉండబోతుంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరల ప్రభావం మార్కెట్‌పై ఏమేరకు ఉంటుంది. దాని పర్యవసనాలు దేశీయ మార్కెట్‌పై ఎలా ఉండబోతాయనే వివరాలపై ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు మాట్లాడారు. నిఫ్టీ 19,900 పైన ముగిసే వరకు స్టాక్‌మార్కెట్లు రేంజ్‌బౌండ్‌లోనే కొనసాగుతాయని అంచనా. నిఫ్టీ ఇండెక్స్ 19,900 కంటే ఎక్కువ లేదా 19,600 కంటే దిగువకు వెళ్తే తప్పా పెరగడం లేదా తగ్గడాన్ని అంచనావేయలేం. అప్పటివరకు రాబోయే సెషన్లలో రేంజ్బౌండ్ ట్రేడ్ కొనసాగే అవకాశం ఉంది. గతవారం మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. ఫెడ్ మినట్స్మీటింగ్ ద్వారా భవిష్యత్తులో కేంద్రబ్యాంకులు కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికంగా వడ్డీరేట్లు ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. 20 వారాల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రకారం 19,400 వద్ద మంచి సపోర్ట్ కనిపిస్తోంది. క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్ల కోసం సింగపూర్ కఠిన నియమాలను ప్రవేశపెడుతుంది . క్రిప్టో సర్వీస్ ప్రొవైడర్లు స్థానికంగా జారీ చేసిన క్రెడిట్ కార్డ్ చెల్లింపులను అక్కడి ప్రభుత్వ నిలిపేసింది. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగా వరుస బాంబు దాడులు కొనసాగుతున్నాయి. గాజా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని అంచనా. యుద్ధానికి ముందు కూడా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ప్రకారం.. చాలా మంది గాజా ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతుండేవారని తెలిపింది. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ ప్రోగ్రాం అంచనా ప్రకారం.. ఆర్థిక, ఆరోగ్య, విద్యా సూచికల్లో దేశం తిరిగి మెరుగవాలంటే దాదాపు 16-19 ఏళ్లు పడుతుందని సమాచారం. చమురు ఉత్పత్తిదారుల 23 దేశాల ఒపెక్ కూటమి తదుపరి సమావేశాన్ని నవంబర్ 30కి వాయిదా వేసింది. సౌదీ అరేబియా, కొన్ని ఆఫ్రికన్ దేశాల మధ్య విభేదాలు కారణంగా చమురు ధరలు పడిపోతున్నట్లు తెలిసింది. చమురు, గ్యాస్ కంపెనీలు క్లీన్ ఎనర్జీలో మరింత పెట్టుబడి పెట్టాలని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సూచించింది. వచ్చే వారం దుబాయ్‌లో ఐక్యరాజ్యసమితి క్లైమెట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ జరగబోతోంది. వాతావరణంలో వివిధ ఉద్గారాలను తగ్గించేలా కీలక నిర్ణయాలు తీసుకునే వీలుంది. అందుకు సంబంధించిన కంపెనీ స్టాక్ల్లో మంచి ర్యాలీ కనిపించనుంది. క్లీన్ఎనర్జీపై పనిచేసే బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలపై దృష్టి పెట్టాలి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ తగ్గిపోతోంది. ఆర్బీఐ తన వద్ద ఉన్న ఫారెక్స్ రిజర్వ్‌లను అమ్మి రూపాయి మరింత పడకుండా నిరోధిస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు దేశీయ మార్కెట్‌ను మరింత తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దాంతో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. పెట్టుబడిదారులు తమ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టాలి. మార్కెట్ కదలికలను అంచనా వేయడానికి బదులుగా ప్రాథమికంగా బలమైన కంపెనీలను విశ్లేషించాలి. మంచి ఫండమెంటల్ కంపెనీలను ప్రతి మార్కెట్ డిప్లో కొనుగోలు చేసేలా సిద్ధంగా ఉండాలి. -
సాక్షి మనీ మంత్ర: ఎన్నికల నేపథ్యంలో ఈ మార్కెట్ స్ట్రాటజీతో లాభాలు!
దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా తీవ్ర ఒడుదుడుకుల్లో పయనిస్తున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకవిలువ పడిపోతుంది. యూఎస్‌లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందనే భయాలు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో రాబోతున్న పండగ నేపథ్యంలో మార్కెట్లు ఎలా కదలాడుతాయో ఫండమెంటల్ బిజినెస్ అనలిస్ట్ కౌశిక్మోహన్తో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ కరుణ్యరావు మాట్లాడారు. కారుణ్యరావు: దేశీయ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కొన్నిరోజుల నుంచి వారి నగదును ఉపసహరించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికవరకు కొనసాగే అవకాశం ఉంది? కౌశిక్‌మోహన్: ఈక్విటీ మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకులు ఉంటాయి. అమెరికాలోని ఫెడ్ కీలక వడ్డీరేట్లను పెంచుతుంది. దాంతో ఎఫ్ఐఐలు అప్రమత్తం అవుతున్నారు. ఒడుదొడుకులులేని అక్కడి డెట్ మార్కెట్లో మదుపుచేసేందుకు ఇష్టపడుతున్నారు. దాంతో భారత్ మార్కెట్లో వారి నగదును ఉపసహరించుకుని అమెరికా వంటి వడ్డీ అధికంగా ఉంటే మార్కెట్లో మదుపు చేస్తున్నారు. వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చేంత వరకు ఈపరిస్థితి కొనసాగనుంది. కారుణ్యరావు: మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకులు ఉన్నా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మాత్రం అంతగా స్పందించడం లేదు. పైగా అవి కొంతమేర పెరుగుతున్నాయి. అందుకుగల కారణం ఏమిటి? కౌశిక్‌మోహన్: మార్కెట్లో ప్రస్తుతం మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలకంటే లార్జ్‌క్యాప్ సూచీల్లో మదుపుచేసేందుకు మంచి అవకాశంగా కనిపిస్తుంది. మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు వాటి త్రైమాసిక ఫలితాలను మెరుగుపరుస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో రిటైలర్లు ఎక్కువగా వస్తుఆధారిత సేవలపై ఖర్చు చేస్తారు. దాంతో ఆ సూచీలు మరింత పెరిగే అవకాశం ఉంది. కారుణ్యరావు: ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సెక్టార్లో మదుపుచేయాలి? కౌశిక్‌మోహన్: అభివృద్ధి చెందుతున్న ఇండియాలో రానున్న రోజుల్లో అన్ని రంగాలు పుంజుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కెమికల్ సెక్టార్ మరింత మెరుగుపడే పరిస్థితులు ఉన్నాయి. చాలా కెమికల్ కంపెనీలు వాటి వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే పారాసిటమోల్లో పారాఅమినోఫినాల్‌ను విరివిగా వాడుతారు. పారాసిటమోల్‌ను మనదేశంలోనే అధికంగా తయారుచేస్తారు. కానీ పారాఅమినోఫినాల్‌ను మాత్రం ఏటా 80వేల మెట్రిక్ టన్నుల మేర చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. ప్రస్తుతం చైనాలోని అనిశ్చితుల కారణంగా ప్రపంచం చూపు భారత్‌పై పడింది. దేశీయంగా ఉన్న కొన్ని కంపెనీలు నైట్రో బెంజీన్ నుంచి పారాఅమినోఫినాల్‌ను తయారుచేస్తున్నారు. దాంతో మరింత అవకాశాలు ఉండే వీలుంది. కేంద్రం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా మరింత లబ్ధిచేకూరే అవకాశం ఉంది. కారుణ్యరావు: ప్రస్తుతం ఫార్మాసెక్టార్లోని స్టాక్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇప్పుడున్న మార్కెట్ ధరలనుంచి ఈ సెక్టార్ మరింత పుంజుకునే అవకాశం ఉందా? కౌశిక్‌మోహన్: దేశీయ మార్కెట్లో ఫార్మాసెక్టార్ మరింత లాభాల్లోకి వెళుతుంది. మారుతున్న జీవన ప్రమాణాల కారణంగా రానున్న రోజుల్లో మాత్రలు, ఇంజెక్షన్లు, వైద్య పరికరాలకు మరింత ఖర్చుచేస్తారు. శరీరంలోని కొవ్వు కరిగించే మందులు తయారుచేసే కంపెనీలు వాటి పెట్టుబడులను విస్తరిస్తున్నాయి. దాంతోపాటు ఆయా కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. సంస్థల భవిష్యత్తు కార్యాచరణను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మెరుగైన లాభాలు పొందే వీలుంది. కారుణ్యరావు: దీపావళి పండగ నేపథ్యంలో జరిగే మూరత్ ట్రేడింగ్‌లో భాగంగా ఏ స్టాక్‌ల ద్వారా లాభాలు సంపాదించవచ్చు? కౌశిక్‌మోహన్: దీపావళి పండగను పురస్కరించుకుని ప్రధానంగా కన్జూమర్ డ్యురబుల్ కంపెనీల్లో మంచి ర్యాలీ కనిపించనుంది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతాయని నమ్ముతున్నాను. కారుణ్యరావు: ఆటోమొబైల్ రంగంలోని సూచీలు చాలా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అందుకు కారణాలు? కౌశిక్‌మోహన్: అక్టోబరు నెలలో ఆఫర్ల నేపథ్యంలో చాలా మంది కొత్త వాహనాలు తీసుకుంటారు. దాంతో ఆ నెలలో ర్యాలీ కనిపిస్తుంది. వచ్చే డిసెంబరులో అంతగా ర్యాలీ ఉండకపోవచ్చు. చివరి నెలలో వాహనాలు తీసుకుంటే ఆ ఏడాది రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక నెల తర్వాత అదే జనవరిలో వాహనాలు కొనుగోలు చేస్తే వచ్చే ఏడాది రిజిస్ట్రేషన్ అవుతుంది. దాంతో సాధారణంగా ఒడుదొడుకులు ఉంటాయి. కారుణ్యరావు: దేశంలోని ఫైనాన్స్ మార్కెట్ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? కౌశిక్‌మోహన్: ఫైనాన్స్ రంగంలో సేవలు అందిస్తున్న ఎన్బీఎఫ్సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రివర్స్ మెర్జర్ అవుతున్నాయి. ఫండమెంటల్స్ బలంగా ఉన్న సంస్థలను ఎంచుకుని ముదుపు చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. కారుణ్యరావు: ఎన్నికల నేపథ్యంలో రానున్న మూడు నెలలకుగాను మార్కెట్లో లాభాలు పొందాలంటే ఎలాంటి స్ట్రాటజీ పాటించాలి? కౌశిక్‌మోహన్: గరిష్ఠంగా మరో ఆరునెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. త్వరగా స్పందించి ఇప్పుడే మదుపుచేస్తే ఎన్నికల సమయం వరకు వచ్చే ర్యాలీలో లాభాలు పొందొచ్చు. మదుపు చేసే ముందు కంపెనీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉందో తెలుసుకోవాలి. త్రైమాసిక ఫలితాలు, బోర్డు సమావేశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. (Disclaimer:సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలువారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే వరకు నిఫ్టీ 97 పాయింట్లు లాభాపడి 19230 వద్దకు చేరింది. సెన్సెక్స్ 282 పాయింట్లు పుంజుకుని 64363 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.28 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, జేఎస్‌డబ్ల్యూ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, హెచ్‌యూఎల్ స్టాక్‌లు లాభాల్లో పయనించాయి. బజాజ్ ఫిన్సర్వ్, టాటాస్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్‌ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, ఎన్టీపీసీలు నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడ్ ఛైర్మన్ గతంలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందనే సూచనలు చేస్తూ వ్యాఖ్యనించారు. దాంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. అనంతరం అమెరికా బాండ్ల రాబడులు 10ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. కానీ బుధవారం రాత్రి జెరొమ్‌పావెల్ ఇకపై వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని తెలపడంతో మార్కెట్ పుంజుకుంది. దాంతో అమెరికాలో ప్రభుత్వ బాండ్ల రాబడులు దిగొచ్చిన నేపథ్యంలో అక్కడి మార్కెట్లు గురువారం రాణించాయి. ఐరోపా సూచీలు సైతం లాభాల్లోనే స్థిరపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక వడ్డీ రేటును 15 ఏళ్ల గరిష్ఠమైన 5.25 శాతం వద్ద ఉంచింది. నేడు ఆసియా- పసిఫిక్ మార్కెట్లూ సానుకూలంగా ట్రేడయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం రూ.1,261.19 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను అమ్మారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,380.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమై మార్కెట్ ముగిసే సమయానికి పుంజుకుని లాభాల్లోకి చేరుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 330 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 257 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 33 పాయింట్ల లాభంతో వారం మెుదటి రోజు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి. మార్కెట్లో వచ్చే తాత్కాలిక ర్యాలీ నిత్యం కొనసాగుతుందని భావించకూడదు. మార్కెట్లు గత వారం బాగా పడిపోవడంతో గతంతో పోలిస్తే స్టాక్‌లు కొంత డిస్కౌంట్లో దొరుకుతున్నాయని భావన ఉంటుంది. కానీ కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు కార్యాచరణ తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అయితే ఏడాది చివరి నాటికి కూడా నిఫ్టీ మళ్లీ 20,000 పాయింట్ల కంటే దాటదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లు పశ్చిమాసియా వివాదానికి సంబంధించిన సంఘర్షణలను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు తీవ్రం అవుతుంటే మాత్రం ఆ ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. సోమవారం మార్కెట్లు రికవరీ కావటంతో ఇన్వెస్టర్ల సంపద పెరిగింది. ఈ క్రమంలో రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, ఓఎన్జీసీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఎల్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, నెస్లే, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కదలాడాయి. యూపీఎల్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఐటీసీ, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, హెచ్‌యూఎల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో పయనించాయి. -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..రికవరీ ఎప్పుడంటే..
ఈక్విటీ మార్కెట్లు గురువారం సైతం నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ గత పది ట్రేడింగ్ సెషన్‌ల్లో తొమ్మిదింటిలో నష్టాల్లోకి లాగబడ్డాయి. దాంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ఈవెంట్‌కు మార్కెట్ ఎల్లప్పుడూ ముందే స్పందిస్తుంది. కాబట్టి, ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే నెలల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయని భావిస్తున్నారు. దాంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. డాలర్ పెరుగుతుడడంతో రూపాయి పతనం కొనసాగవచ్చనే భయాలు ఉన్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్‌లు గరిష్ఠస్థాయికి చేరుతున్నాయి. విదేశీ, రిటైల్ మదుపరులు ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు ఇంకా దిగజారిపోతున్నాయి. మార్కెట్లు ఓవర్‌సోల్డ్ జోన్లోకి చేరుకోవడంతోపాటు, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సద్దుమనుగుతే తప్పా మార్కెట్లు కోలుకునే అవకాశం లేదని తెలుస్తుంది. దేశీయ మార్కెట్ సూచీలైన నిఫ్టీ గడిచిన ట్రేడింగ్‌తో పోలిస్తే 264 పాయింట్లు నష్టపోయి 18857 వద్దకు చేరింది. సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయి 63148 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.210కు చేరింది. క్రూడ్ బ్యారెల్ ధర 84.36డాలర్లకు చేరింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.32శాతం పడిపోయింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.06శాతం నష్టాల్లోకి జారుకున్నాయి. సెనెక్స్ 30 లో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా అన్ని స్టాక్‌లు నష్టాల్లోకి వెళ్లాయి. అధికంగా ఎం అండ్ ఎం, బజాజ్‌ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
వచ్చేవారం మార్కెట్లు ఎలా ఉంటాయంటే?
వచ్చే వారంలో మార్కెట్ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. వారంతంలో అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలతో రానున్న రోజుల్లో మార్కెట్ ఎలా స్పందిస్తుంది.. దసరా పండగ సీజన్లో మార్కెట్ ఎలా ఉంటుందనే అంశాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నాయి. అదే తీరు కొనసాగనుంది. దసరా, దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్‌గా విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఉపసంహరించుకునే వీలుంది. గడిచిన వారంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. డాలర్ విలువ పెరుగుతుండడంతో రూపాయి మారకం పడిపోయి ధరలు పెరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారాలు, పండగ నేపథ్యంలో పెద్దగా నష్టపోయే అవకాశం ఉండదు. కేంద్రం అందిస్తున్న ప్రయోజనాల మూలంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు బలంగా ఉన్నాయి. దేశంలో యువత ఎక్కువగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో తాత్కాలికంగా కొంత ఒడుదుడుకులు నెలకున్నా దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. యూఎస్ ట్రెజరీలు అనిశ్చితిలో ఉన్నాయి. భవిష్యత్తులో మార్కెట్ సంక్షోభానికి సంబంధించి పెట్టుబడిదారులు ఎలా స్పందిస్తారనే అంశాన్ని గమనించాలి. అమెరికా ట్రూప్లపై డ్రోన్లు దాడిచేసేందుకు ప్రయత్నించాయనే వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్, హమాస్‌కు మాత్రమే యుద్ధం కొనసాగితే మార్కెట్లు పెద్దగా స్పందించే స్థితిలో లేవు. కానీ వాటికి మద్ధతు ఇస్తున్న దేశాల స్పందించే విధానం వల్ల యుద్ధ భయాలు చెలరేగితే మార్కెట్లు నష్టాల్లోకి జారుకునే అవకాశం ఉంటుంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచడంతో మదుపర్లు తమ సొమ్మును భద్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. యూఎస్ 10 ఏళ్లు ట్రెజరీ బాండ్లు ఏప్రిల్ నుంచి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన వారంలో గరిష్ఠాన్ని తాకాయి. అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఈ అన్ని కారణాల వల్ల వచ్చేవారం మార్కెట్లు కొంత ఒడుదుడుకులకు లోనవచ్చు. గతవారంలో నిఫ్టీ 19850 వద్దకు చేరి అక్కడి నుంచి ప్రతికూలంగా స్పందించింది. వారం మధ్యలో బెంచ్‌మార్క్ సూచీల్లో అమ్మాకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు రెండూ వారంలో ఒక శాతం కంటే ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమై అదేచోట ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గడిచిన మూడు రోజులుగా నష్టాల్లో పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రం దాదాపుగా ప్రారంభ స్థాయిల వద్దే ముగిశాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. పావెల్ ప్రకటనతోపాటు వారంతంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గ్లోబల్ ఇండియన్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 231.36 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 82.05 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 32 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 454 పాయింట్లు పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.7 శాతం మేర నష్టపోయింది. ఎన్ఎస్ఈలో కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, టీసీఎస్, ఎన్టీపీసీ, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఐటీసీ, టాటా స్టీల్, బీపీసీఎల్, దివీ ల్యాబ్స్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, హీరో మోటార్స్, యూపీఎల్, హిందాల్కొ, ఎస్బీఐ, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
స్టాక్ ఫలితాల వేళ ఇవి పాటిస్తే మేలు
దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఒక్కొక్కటిగా తమ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. స్టాక్ ఫలితాలకు తగ్గట్టుగా మన పెట్టుబడి వ్యూహాన్ని మారుస్తుంటాం. అయితే కొన్ని రోజులుగా మార్కెట్‌ను అనుసరిస్తున్నవారు, కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు ఈ సమయంలో ఎలా స్పందించాలో నిపుణులు కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. • మన పోర్ట్‌ఫోలియోలోని కంపెనీలు వాటి ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తుందో ట్రాక్ చేయాలి. ఇది సాధారణంగా ముందుగానే షెడ్యూల్ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇన్వెస్టర్ రిలేషన్స్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. • ఫలితాల్లో కంపెనీలు తమ ఆదాయాలు, బ్యాలెన్స్ షీట్, క్యాష్‌ఫ్లో సహా దాని ఆర్థిక నివేదికలను ప్రకటిస్తాయి. స్టాక్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ నివేదికల వల్ల కంపెనీ పనితీరును సమీక్షించడానికి వీలువతుంది. • కంపెనీలు ఫలితాలు విడుదల చేయడానికి ముందే ఆర్థిక నిపుణలు, విశ్లేషకులు తరచు సంస్థ పనితీరును గమనిస్తూ రిజల్ట్స్‌ను అంచనా వేస్తారు. ఈ అంచనాలతో వాస్తవ ఫలితాలను సరిపోల్చాలి. ఒకవేళ ఫలితాలు అంచనాలను మించి ఉంటే అది సానుకూలంగా పరిగణించవచ్చు. • గతంలో కంపెనీ పనితీరు ఎలా ఉంది.. ఫలితాలు ప్రభావితం చేసే ఏవైనా ఆర్థిక అంశాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. • చాలా కంపెనీలు వాటి భవిష్యత్ పనితీరుపై మార్గదర్శకత్వం లేదా ఔట్‌లుక్‌ను విడుదల చేస్తాయి. సానుకూలంగా నివేదికలు అందించే కంపెనీల్లో స్టాక్ పెరుగుదల చూడవచ్చు. • ఫలితాల వల్ల మార్కెట్ ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఒక్కోసారి స్టాక్ ధర వేగంగా పడిపోవచ్చు..పెరగొచ్చు. స్టాక్ సంబంధించిన అన్ని అంశాలను గమనించాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే స్టాక్ ధరలో హెచ్చుతగ్గులు అంతగా పట్టించుకోవద్దు. స్వల్పకాలిక మార్కెట్ కదలికల ఆధారంగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు. • ఒకే కంపెనీలో కాకుండా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న ఫలితాలు విడుదల చేయకపోయినా పోర్ట్‌ఫోలియో పెద్దగా నష్టాల్లోకి వెళ్లకుండా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు, లాభాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫలితాల ఆధారంగా స్టాక్ అమ్మాలో, కొనాలో అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు కంపెనీ భవిష్యత్తు పనితీరును పరిగణలోకి తీసుకోవాలి. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో కదలాడుతున్న దేశీయ మార్కెట్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్ల లాభంతో 66413 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 19,787 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమై.. చివరకు అవే లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు మాత్రం స్పష్టమైన లాభాలతో స్థిరపడ్డాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధ భయాల నుంచి మార్కెట్లు క్రమంగా కోలుకుంటాన్నాయినే సంకేతాలు ఉన్నాయి. అయితే, చమురు ధరల పెరుగుదల మాత్రం కలవరపెడుతోంది. మంగళవారం బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 87.91 డాలర్లకు చేరింది. -
ప్రపంచానికి మాంద్యం గుబులు, పడిపోతున్న రూపాయి విలువ!
ముంబై: ప్రపంచ దేశాలను మళ్లీ మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం ఆందోళనలు, పలు దేశాల రుణ రేట్ల పెంపుతో ప్రపంచ వృద్ధిబాటలోంచి క్షీణతలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషణలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు తక్షణ మార్గంగా డాలర్ కనబడుతోంది. దీనితోపాటు ఫెడ్ కఠిన ద్రవ్య విధానంతో ప్రపంచవ్యాప్తంగా నిధులు డాలర్లలోకి వస్తున్నాయి. ఈ వార్త రాసే 11 గంటల సమయంలో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 106.50 డాలర్లపైన గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక పతనం కొనసాగుతోంది. మంగళవారం 38 పైసలు పతనమై 79.33 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 79.38 స్థాయిని కూడా చూసింది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కు మళ్లడం రూపాయి భారీ పతనానికి కారణమవుతోంది. ఈ రెండు స్థాయిలు రూపాయికి ముగింపు, ఇంట్రాడే కనిష్ట స్థాయిలు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లాభాల బాటన పయనిస్తుండగా, నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 35 డాలర్లు పతనమై (2 శాతం) 1,767కు చేరింది. క్రూడ్ 10 శాతం వరకూ పడిపోయి 100 డాలర్ల దిగువకు చేరింది. -
ఈ వారం స్టాక్ మార్కెట్లు: ఇన్వెస్టర్లు జాక్‌పాట్ కొడతారా? లేదంటే నష్టపోతారా?
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో స్థిరీకరణ దిశగా సాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, క్రూడాయిల్ ధరలపై దృష్టి పెట్టొచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ క్వార్టర్ త్రైమాసిక ఫలితాల సీజన్ ఆరంభం నేపథ్యంలో అప్రమత్తతకు అవకాశం లేకపోలేదంటున్నారు. జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా షార్ట్స్ కవర్ చోటు చేసుకోవడంతో గతవారంలో సెన్సెక్స్ 179 పాయింట్లు, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్లు స్థిరమైన ప్రదర్శన కనబరిచినట్లైయితే బుల్స్ రిలీఫ్ ర్యాలీకి అవకాశం ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నా.., గతవారంలో అమ్మకాల ఉధృతి తగ్గడం శుభసూచకం. క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, రూపాయి కదలికలు ట్రెండ్‌ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. చివరి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ నష్టాల్లో ముగిసినా.., సాంకేతికంగా కీలకమైన మద్దతు 15,750 స్థాయిని నిలుపుకొంది. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,500 వద్ద మద్దతు లభించొచ్చు. ఎగువస్థాయిలో కొనుగోళ్ల జరిగితే 15,900 వద్ద నిరోధాన్ని ఎదుర్కోనుంది. అటు పిదప 16,170–16,200 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్ రీసెర్చ్ సంతోష్ మీనా తెలిపారు. 1. ఆర్థిక ఫలితాల సీజన్ ఆరంభం టీసీఎస్ శుక్రవారం జూన్(8న) క్వార్టర్ ఆర్థిక గణాంకాలను వెల్లడించి కార్పొరేట్ ఫలితాల సీజన్‌కు తెరతీయనుంది. ‘‘అట్రిషన్ రేటు పెరగడంతో ఐటీ రంగం, మందగమనంతో మౌలికరంగం., సైక్లికల్స్ సెక్టార్ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశ కలిగించవచ్చు. అయితే ఆటో, ఎఫ్ఎంసీజీ కంపెనీల గణాంకాలు మెప్పించవచ్చు. కార్పొరేట్ ఫలితాల ప్రకటనకు ముందు స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది’’ అని నిపుణులు చెబుతున్నారు. టీసీఎస్‌తో పాటు పీటీసీ ఇండియా, జీఎం బేవరీజెస్, మైసూర్ పేపర్ మిల్స్, వక్రంజీ, కోహినూర్ ఫుడ్స్ తదితర కంపెనీలు ఈ వారంలో ఆర్థిక పలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. 2. ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్(బుధవారం)తో పాటు జూన్ ఎస్అండ్పీ గ్లోబల్ తయారీ, సేవారంగ పీఎంఐ డేటా విడుదల కానుంది. ఇదేవారంలో మంగళవారం యూరోజోన్ ఎస్అండ్పీ గ్లోబల్ సర్వీసెస్ కాంపోసైట్ పీఎంఐ, బుధవారం కన్స్ట్రక్షన్ పీఎంఐ, మే మాసపు రిటైల్ అమ్మకాలు వెల్లడి కానున్నాయి. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. రష్యా – ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. -
రూ.150 లక్షల కోట్లకు రిటైల్ పరిశ్రమ!
ముంబై: రిటైల్ పరిశ్రమ తిరిగి వృద్ధి క్రమంలోకి ప్రవేశించిందని, ఏటా 10 శాతం చొప్పున ప్రగతి సాధిస్తూ 2032 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లు (రూ.150 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. ‘భారత్‌లో రిటైల్ పరిశ్రమ తదుపరి దశ’ పేరుతో బీసీజీ–రాయ్ (రిటైల్ అసోసియేషన్) బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఫుడ్, గ్రోసరీ, రెస్టారెంట్లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్), కన్జ్యూమర్ డ్యురబుల్స్ విక్రయాలు కరోనా ముందు నాటి స్థాయికి కోలుకున్నట్టు.. జ్యుయలరీ, యాక్సెసరీ, వస్త్రాలు, పాదరక్షలు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకునే క్రమంలో ఉన్నాయని వివరించింది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ వినియోగం ఆధారితంగా నడుస్తుంది. రెండేళ్ల తర్వాత వినియోగంలో వృద్ధి తిరిగి సానుకూల స్థాయికి చేరింది’’ అని బీసీజీ ఎండీ అభీక్ సింఘి తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో సంఘటిత రిటైల్ రంగం.. వృద్ధి కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్, అన్ని ఫార్మాట్లలోనూ మరింత విస్తరణపై దృష్టి సారిస్తుందని అంచనా వేసింది. దేశంలో వినియోగం కరోనాకు ముందు ఏటా 12 శాతం చొప్పున వృద్ధి చెందగా, మహమ్మారి సమయంలో మైనస్‌లోకి జారిపోయిందని, ఇప్పుడు కోలుకుని కరోనా ముందు నాటి స్థాయిని దాటినట్టు వివరించింది. ఈ కామర్స్ విభాగం 2021 నాటికి 45 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2026 నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. 2022–23లో రెండంకెల వృద్ధి ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ పరిశ్రమలో వృద్ధి దిగువ రెండంకెల స్థాయిలో ఉండొచ్చని షాపర్స్‌స్టాప్ ఎండీ, సీఈవో వేణు నాయర్ అంచనా వేశారు. కరోనా మహమ్మారికి సంబంధించిన ఆంక్షలను సడలించేయడంతో కస్టమర్లు తిరిగి ఆఫ్‌లైన్ స్టోర్లకు రావడం పెరుగుతున్నట్టు చెప్పారు. ‘‘కస్టమర్ల రాక కరోనా ముందుస్తు స్థాయికి చేరింది. గడిచిన రెండు నెలలుగా ఇది బలంగా ఉంది. రిటైల్ వ్యాపారంలో అధిక స్థాయి ఒక అంకె (8–9శాతం) లేదంటే దిగువ స్థాయి రెండంకెల్లో (11–13శాతం) వృద్ధి నమోదు కావచ్చు’’అని నాయర్ తెలిపారు. భవిష్యత్తు రిటైల్ అంతా ఓమ్నిచానల్ రూపంలోనే ఉంటుందని (ఆన్లైన్, ఆఫ్‌లైన్), అదే సమయంలో ఆన్లైన్ ఇక ముందూ కీలకంగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 డిపార్ట్మెంట్ స్టోర్లు, 20 బ్యూటీస్టోర్లు ప్రారంభించనున్నట్టు వేణు నాయర్ వెల్లడించారు. వృద్ధి కోసం స్టోర్ల విస్తరణ అన్నది తమకు కీలకమని, దానిపై దృష్టి కొనసాగిస్తామని చెప్పారు. భాగస్వామ్యాల గురించి మాట్లాడుతూ.. ‘‘ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లతో టైఅప్ అవుతున్నాం. ఎన్నో కొత్త బ్రాండ్లు మా నిర్వహణలో ఉన్నాయి. మరిన్ని నూతన బ్రాండ్లు కూడా రానున్నాయి. మాకు సరిపోతాయని భావిస్తే కచ్చితంగా మా స్టోర్లలో వాటిని అందుబాటులోకి తీసుకొస్తాం’’అని వేణు నాయర్ వివరించారు. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్లైన్లోనే ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. భౌతికంగా స్టోర్లకు స్థలాల విషయంలో పరిమితి ఉంటుందని.. ఆన్లైన్లో ఈ ఇబ్బంది ఉండదు కనుక కొత్త బ్రాండ్లను ముందగా ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తున్నట్టు వివరించారు. -
మార్కెట్ ర్యాలీ మిస్సయ్యారా?
గతేడాది కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత నెల రోజులకు ఈక్విటీ మార్కెట్లు పాతాళానికి పడిపోయాయి. అక్కడి నుంచి ఏడాది తిరిగేసరికి ఈక్విటీ మార్కెట్లు మళ్లీ శిఖర స్థాయిలకు చేరుకున్నాయి. చారిత్రకంగా చూస్తే సంక్షోభంలోనూ ఇంత బలమైన బుల్ ర్యాలీ అన్నది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇదేనట. ఈక్విటీ మార్కెట్లు అంటేనే అస్థిరతలకు నిలయం. అందుకే ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకునే స్టాక్స్ సవాళ్లకు, సంక్షోభాలకు కుదేలై పోకుండా గట్టిగా ఎదుర్కొని మళ్లీ ప్రగతి దిశగా ప్రయాణించే సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ భవిష్యత్తు అంచనాల ఆధారంగానే చలిస్తుంటాయి. కనుక ప్రస్తుత ఆర్థిక అంశాలపై కాకుండా దేశ వృద్ధి చక్రం త్వరలోనే రెండంకెల స్థాయికి పరుగెడుతుందన్న అంచనాలు ర్యాలీకి మద్దతుగా నిలిచే అంశమని విశ్లేషణ. ఏడాది కాలంలో కరోనా పూర్తి నియంత్రణలోకి వస్తుందని.. ఆ తర్వాత వృద్ధి వేగాన్ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. అస్థిరతలకు చలించిపోకుండా, గట్టిగా నిలబడే కంపెనీలు ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో ఉండడం ఎంతైనా అవసరం. అంటే.. బేర్ మార్కెట్లో పడిపోకుండా ఉండే స్టాక్స్ అని కాదు అర్థం. బేర్ మార్కెట్ తర్వాత వచ్చే బుల్ పరుగులో బలంగా పాల్గొనే సత్తా వాటికి ఉండాలన్నది విశ్లేషకుల సూచన. అందుకు ఏం చేయాలన్నది తెలియజేసే ప్రాఫిట్‌ప్లస్ కథనం ఇది.. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు యావరేజ్ చేస్తుంటారు. అంటే ఒక స్టాక్‌ను కొనుగోలు చేసిన తర్వాత.. అది పడిపోతూ ఉంటే ధరలు ఆకర్షణీయంగా అనిపించి మరికొంత మొత్తం పెట్టుబడి పెడుతూ వెళతారు. దీంతో తెలియకుండానే ఒక్క స్టాక్‌లోనే ఎక్కువ పెట్టుబడులు పోగుపడతాయి. మరి నిజంగా ఆ కంపెనీ తిరిగి పూర్వపు స్థాయికి చేరుకోకపోతే..? మరింత పతనమై అలాగే ఉండిపోతే..? రిటైల్ ఇన్వెస్టర్ ఈ విధంగా ప్రశ్నించుకుని వివేకంతో పెట్టుబడులు పెడితేనే లాభాలు అందుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. యావరేజ్ విషయమై ప్రాచుర్యంలో ఉన్న కథనం కూడా ఒకటి ఉంది. ఒక స్టాక్‌ను బుల్ మార్కెట్లో మూడు అంకెల్లో ఉండగా కొనుగోలు చేసి.. బేర్ మార్కెట్లో రెండంకెల స్థాయికి పడిపోయిన తర్వాత యావరేజ్ చేసి తదుపరి బుల్ మార్కెట్లో.. ఒక అంకె ధరలో (రూ.10కు దిగువన) విక్రయించినట్టుగా ఉంటుంది యావరేజ్ చేయడం. బలమైన, పటిష్టమైన ఆర్థిక మూలాలు ఉండి, వ్యాపార పరంగా మోట్ (పోటీలేని) కలిగి ఉన్న వాటిని తక్కువ ధరల్లో యావరేజ్ చేయడం కొంత వరకు సరైనదే అని చెప్పుకోవచ్చు. అది కూడా కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యల్లేకుండా.. కేవలం తాత్కాలిక పరిణామాల వల్ల ధరల్లో దిద్దుబాటు వస్తే యావరేజ్‌ను అవకాశంగా చూడొచ్చు. కానీ, కారణం తెలియకుండా యావరేజ్ చేయడం వల్ల లాభం కంటే నష్టాలకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా యావరేజ్‌తో ఉన్న పెద్ద ప్రతికూలత పెట్టుబడులన్నీ కేవలం కొన్ని స్టాక్స్‌లోనే ఎక్కువగా పోగవడం. ఒక్కోసారి యావరేజ్ చేసేందుకు పెట్టుబడుల్లేక.. తమ పోర్ట్‌ఫోలియోలో లాభాలు చూపిస్తున్న స్టాక్స్‌ను విక్రయించేసే వారు కూడా ఉన్నారు. బంగారు గుడ్లు పెట్టే బాతును కోసిన చందమే అవుతుంది ఇది. బుల్ మార్కెట్ ముగిసి బేర్ మార్కెట్లోకి ప్రవేశించినట్టయితే.. అప్పటి వరకు ఎదురేలేదు అనుకున్న కంపెనీలు కనిపించకుండా పోవచ్చు. జేపీ అసోసియేట్స్, యూనిటెక్, అడాగ్ గ్రూపు కంపెనీలైన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, సుజ్లాన్ ఇలా చెప్పుకునేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నిఫ్టీ స్టాక్ యస్ బ్యాంకు పతనం గుర్తుండే ఉంటుంది. యస్ బ్యాంకు రాణా కపూర్ సారథ్యంలో మరింత ముందుకు వెళుతుందని, రూ.2,000 వరకు స్టాక్ వెళ్లొచ్చన్న అంచనాతో ఇన్వెస్ట్ చేసిన వారూ ఉన్నారు. రూ.400 స్థాయి నుంచి యస్ బ్యాంకు స్టాక్ ధర క్రమంగా పడిపోతూ ఉంటే.. రూ.200–300 మధ్య తిరిగి పెద్ద ఎత్తున యావరేజ్, కొనుగోలు చేసిన వారు గణనీయంగా ఉన్నారు. అంతేకాదు అక్కడి నుంచి రూ.12 స్థాయి వరకు యావరేజ్ చేస్తూ మరింత పెట్టుబడులు పెట్టిన వారున్నారు. జియోడెసిక్, తులిప్ టెలికం, ఎడ్యుకాంప్, ఎవరాన్, కరుతూరి గ్లోబల్, ఐవీఆర్సీఎల్ ఇలా ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించేసిన స్టాక్స్ బండెడున్నాయి. కేటాయింపుల్లో పరిమితులు ఒక్కో రంగం ఒక్కో కాలంలో గణనీయంగా ర్యాలీ చేస్తుంటుంది. 2005–2007 కాలంలో ఇన్ఫ్రా, విద్యుత్ కంపెనీలు భారీ ర్యాలీ చేశాయి. మళ్లీ ఆ స్థాయి ర్యాలీ ఇంత వరకు వాటిల్లో చూడలేదు. 2008 కరెక్షన్కు ముందు విద్యుత్, ఇన్ఫ్రా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పటికీ లాభాలు వచ్చిన దాఖలాలు లేవు. కనుక ఈ తరహా ర్యాలీలను ముందుగా అంచనా వేసి ఇన్వెస్ట్ చేయగలిగితే గణనీయమైన రాబడులను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనదేశంలో రానున్న కాలంలో విద్యుత్ వాహనాల మార్కెట్ భారీగా వృద్ధి చెందుతుందన్న అంచనాలున్నాయి. ఇదే అంచనాతో కొన్నేళ్ల క్రితం టెస్లా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పుటికే కోటీశ్వరులయ్యారు. కానీ టెస్లా స్టాక్ బంపర్ ర్యాలీ చేయడానికి ముందు పలు పర్యాయాలు దివాళా అంచుల వరకు వెళ్లొచ్చిన సంగతి ఎంత మందికి తెలుసు? అందుకే తొలి దశలోనే భవిష్యత్తు విజేత ఎవరన్నది గుర్తించడం కొంచెం కష్టం. ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియోలో మీ ప్రతిభ కారణంగాను లేదా అదృష్టం కొద్దీ మల్టీబ్యాగర్ స్టాక్‌ను కొనుగోలు చేసి ఉన్నారనుకోండి.. ఆ కంపెనీ భవిష్యత్తులో ఇంకా ఎంతో వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని నిపుణులు ఘంటా పథంగా చెబుతుంటే.. ఎగువ వైపున యావరేజ్ చేయడం మంచిదే అవుతుంది. అది కూడా మీరు గతంలో కొనుగోలు చేసిన ధరకు కొంచెం సమీపంలో ఉంటేనే. మీ కొనుగోలు ధరపై అప్పటికే 10 రెట్లు, 20 రెట్లు పెరిగిన తర్వాత మరో 100 శాతం, 200 శాతం వృద్ధి కోసం యావరేజ్ చేయడం కంటే ఆ పెట్టుబడులను అలాగే కదపకుండా కొనసాగించడం సరైనది. ఎందుకంటే అంత పెరిగిన తర్వాత పనితీరు అంచనాలు కొంచెం తేడా వచ్చినా స్టాక్‌లో దిద్దుబాటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే రిస్క్‌ను బట్టి ఇన్వెస్టర్లు అడుగులు వేయాలి. ఇన్వెస్టర్లు తగినంత అధ్యయనం తర్వాతే స్టాక్‌లో ఒకే విడత పెట్టుబడులు పెట్టాలి. లేదా ఫలానా స్టాక్‌లో రూ.10వేలు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంటే.. ఐదు నుంచి పది విడతల్లో రూ.1,000–2,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లి అంతటితో ఆగిపోవాలి. ఒకటికి మించిన విడతల్లో కొనుగోలుకు నిర్ణయించుకున్నట్టయితే.. ఫండమెంటల్స్ మారనంత వరకు స్టాక్ ధర ఏ స్థాయిలో ఉన్నా పట్టించుకోవక్కర్లేదు. అంతేకానీ, ముందుగా నిర్ణయించుకున్న పరిమితిని మించి యావరేజ్‌లు చేయకూడదు. దీనివల్ల ఒక స్టాక్‌లో పెట్టుబడి రూ.10వేలకు పరిమితం అవుతుంది. మీ అంచనాలు నిజమై, కంపెనీ మంచి వృద్ధినే చూపిస్తే చక్కని రాబడులు సొంతం అవుతాయి. ఒకవేళ అంచనాలు తప్పి కంపెనీ పనితీరు బాగోలేక స్టాక్‌లో పతనం వచ్చిందనుకుంటే ఆ నష్టం పరిమితమవుతుంది. అందుకే ఇన్వెస్టర్ తనవద్దనున్న మొత్తం పెట్టుబడుల్లో ఒక స్టాక్‌కు 5–10 శాతం మించి కేటాయింపులు చేసుకోకూడదని నిపుణులు సూచిస్తుంటారు. మూలాలు మర్చిపోకూడదు నాణ్యమైన కంపెనీలు, మెరుగైన యాజమాన్యాలు, మంచి నగదు ప్రవాహాలతో కూడిన బలమైన బ్యాలన్స్ షీట్లు ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకోవడం కూడా రిస్క్ తగ్గించుకునే మార్గాల్లో ముఖ్యమైనది. బేర్ మార్కెట్లలో ఈ తరహా కంపెనీలు పడినా గట్టిగానే నిలబడతాయి. తిరిగి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత మంచి పనితీరును నమోదు చేస్తాయి. నాణ్యమైన కంపెనీల్లో యావరేజ్ చేయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. మంచి నాణ్యమైన స్టాక్‌ను కొనుగోలు చేసిన తర్వాత స్టాక్ ధర పడిపోయినప్పటికీ కంగారు పడిపోనక్కర్లేదు. అదనపు పెట్టుబడులకు అవకాశంగానే చూడొచ్చు. ముఖ్యంగా సైక్లికల్ స్టాక్స్‌లో యావరేజ్ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. చారిత్రకంగా చూస్తే సైక్లికల్ స్టాక్స్ కనిష్ట విలువల వద్ద లభిస్తున్నప్పుడు వాటిని కొనుగోలు చేయడం, యావరేజ్ చేయడం కలిసొస్తుంది. కొంత ‘క్యాష్’ ఉంచుకోవాలి బేర్ మార్కెట్లే కాదు.. బుల్ మార్కెట్లు కూడా దీర్ఘకాల ఇన్వెస్టర్ల పెట్టుబడులకు అవకాశాలు తీసుకొస్తుంటాయి. పెట్టుబడులకు అనువైన అవకాశాలు ఈక్విటీ మార్కెట్లలో అన్నివేళలా అందుబాటులో ఉంటుంటాయి. మార్కెట్లు చారిత్రకంగా గరిష్టాల వద్ద ట్రేడవుతున్నాయని పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, కనిష్టాల వద్ద ట్రేడవుతున్నాయని పూర్తిగా పెట్టుబడులు పెట్టేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లు ఎప్పుడైనా కుప్పకూలిన తర్వాత వచ్చే బుల్ ర్యాలీలో స్పెక్యులేటివ్ ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుంది. దాన్ని చూసి కంగారు పడాల్సిన పనిలేదు. 2004–2007 బుల్ ర్యాలీలో పెట్టుబడులు పెట్టలేకపోయామని బాధపడిన వారికి.. 2009లో మరో అవకాశం వచ్చింది. 2005 నాటి విలువల వద్ద తిరిగి 2009లో ఆయా స్టాక్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే, 2013–2020 మధ్య ర్యాలీలో పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోలేకపోయామే అని బాధపడిన వారికి 2020 మార్చి–ఏప్రిల్ దిద్దుబాటులో 2014 నాటి కనిష్ట విలువలకు స్టాక్స్ లభించాయి. అందుకే మార్కెట్లలో అవకాశాలను కోల్పోయామన్న వెర్రి పనికిరాదు. ఓపికగా వేచి చూసే ధోరణితో ఉంటే మంచి అవకాశాలు ఎప్పుడూ వస్తుంటాయి. ప్రస్తుత బుల్ ర్యాలీలో పాల్గొనలేదని మథనపడొద్దు. మళ్లీ ఆకర్షణీయమైన విలువల వద్ద స్టాక్స్‌లోకి ప్రవేశించేందుకు భవిష్యత్తులోనూ అవకాశాలు తలుపులు తడతాయి. -
సెన్సెక్స్ 518 పాయింట్లు పతనం
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి మరింత క్షీణించాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 518 పాయింట్లు కోల్పోయి 37,088 కు చేరగా.. నిఫ్టీ 140 పాయింట్ల వెనకడుగుతో 10,933ను తాకింది. తద్వారా సెన్సెక్స్ 37,000 పాయింట్లవైపు కదులుతుంటే .. నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్ దిగువన ట్రేడవుతోంది. ఐటీ, రియల్టీ వీక్ ఎన్ఎస్ఈలో ప్రయివేట్ బ్యాంక్స్ 2.25 శాతం నీరసించగా.. ఐటీ, రియల్టీ దాదాపు 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. అయితే ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ రంగాలు 1.25 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, టైటన్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, హిందాల్కో, ఎస్బీఐ, ఐషర్, బీపీసీఎల్ 5-0.5 శాతం మధ్య ఎగశాయి. అయితే యూపీఎల్, ఇండస్ఇండ్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, ఐవోసీ, ఆర్ఐఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హీరో మోటో 6-1.6 శాతం మధ్య క్షీణించాయి. చిన్న షేర్లు ఓకే బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3-0.9 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1316 లాభపడగా.. 1069 నష్టాలతో కదులుతున్నాయి. ఎన్ఎస్ఈలో బంధన్ బ్యాంక్ 10 శాతం కుప్పకూలగా.. అపోలో హాస్పిటల్స్, ఆర్బీఎల్, ఎస్బీఐ లైఫ్, ఎస్కార్ట్స్, ఐబీ హౌసింగ్ 3.6-2.7 శాతం మధ్య డీలాపడ్డాయి. కాగా.. మైండ్‌ట్రీ, ఐడియా, దివీస్, టైటన్, పీఎన్బీ, టొరంట్ ఫార్మా, బీఈఎల్, మదర్సన్ 5-2.2 శాతం మధ్య ఎగశాయి. -
నేడు మార్కెట్లు వీక్- విదేశీ మార్కెట్లు డౌన్
నేడు (14న) దేశీ స్టాక్ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.10 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 66 పాయింట్లు క్షీణించి 10,748 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 10,814 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రధానంగా ఫాంగ్ స్టాక్స్ దెబ్బతీయడంతో సోమవారం నాస్డాక్, ఎస్అండ్పీ 2-1 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. నేడు బ్యాంకింగ్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో డోజోన్స్ యథాతథంగా నిలిచింది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో ప్రతికూల ధోరణి కనిపిస్తోంది. దీంతో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తదుపరి ఆటుపోట్లను చవిచూడవచ్చని భావిస్తున్నారు. ఆటుపోట్ల మధ్య ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో సోమవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ఓమాదిరి లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 99 పాయింట్లు బలపడి 36,694 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 35 పాయింట్లు పుంజుకుని 10,803 వద్ద నిలిచింది. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 425 పాయింట్లు జంప్‌చేసింది. 37,000 పాయింట్ల కీలకమార్క్‌ను అధిగమించింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 10,741 పాయింట్ల వద్ద, తదుపరి 10,680 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,879 పాయింట్ల వద్ద, ఆపై 10,996 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,828 పాయింట్ల వద్ద, తదుపరి 21,567 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,504 పాయింట్ల వద్ద, తదుపరి 22,918 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. డీఐఐల భారీ అమ్మకాలు నగదు విభాగంలో సోమవారంవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 222 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1459 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 1031 కోట్లు, డీఐఐలు రూ. 431 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మార్కెట్ల ఈ ర్యాలీ నిలుస్తుందా?
కొద్ది రోజులుగాదేశీ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ర్యాలీ కారణంగా షేర్లు అధిక ధర పలుకుతున్నాయని బ్రోకింగ్ సంస్థ జెఫరీస్ పేర్కొంటోంది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్‌లను అమలు చేస్తున్న నేపథ్యంలో పలు కంపెనీల లాభార్జన నీరసించనున్నట్లు తెలియజేసింది. దీంతో షేరువారీ ఆర్జన(ఈపీఎస్)లు డౌన్‌గ్రేడ్ కానున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 19.7 రెట్లు ప్రీమియంలో ట్రేడవుతున్నట్లు తెలియజేసింది. అంటే దాదాపు 2008 జనవరి గరిష్టాల స్థాయిలో మార్కెట్లు కదులుతున్నట్లు వివరించింది. 2008లో అంతర్జాతీయంగా చెలరేగిన ఆర్థిక సంక్షోభం ఫలితంగా తదుపరి దశలో మార్కెట్లు పతనమైన విషయం విదితమే. రీసెర్చ్ నోట్లో జెఫరీస్ ఇంకా ఏమన్నదంటే..! 44 శాతం ర్యాలీ మార్చి కనిష్టం నుంచి నిఫ్టీ 44 శాతం ర్యాలీ చేసింది. 7,511 పాయింట్ల కనిష్టం నుంచి 10,813 పాయింట్ల వరకూ ఎగసింది. అయితే కోవిడ్-19 ప్రభావంతో ఇటీవల పలు కంపెనీల ఈపీఎస్‌లు డౌన్‌గ్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లలో కనిపిస్తున్న ర్యాలీ పటిష్టతపై సందేహాలు నెలకొనడం సహజం. ఇప్పటికే నిఫ్టీ ఈపీఎస్‌పై అంచనాలలో కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 28 శాతం.. వచ్చే ఏడాదిలో 14 శాతం చొప్పున నిఫ్టీ ఈపీఎస్‌పై డౌన్‌గ్రేడ్స్ వెలువడ్డాయి. ఈ ఏడాది తొలి త్రైమాసిక (ఏప్రిల్-జూన్) ఫలితాలు విడుదలయ్యాక ఈపీఎస్ అంచనాలు మరింత తగ్గే వీలుంది. నిధులు వెనక్కి ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితుల కారణంగా మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. యాంఫీ(AMFI) వివరాల ప్రకారం జూన్‌లో ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ. 1800 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత ఆరేళ్లలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. ఫండ్స్‌లోకి పెట్టుబడులు రావడానికి బదులుగా నిధుల ఉపసంహరణ జరగడం ప్రతికూల అంశం. అయితే మెరుగైన ఆర్థిక గణాంకాలు, ప్రపంచవ్యాప్తంగా రిస్క్‌లను ఎదుర్కొనగల సామర్థ్యం పెరగడం వంటి అంశాలు మార్కెట్లలో దిద్దుబాటు(కరెక్షన్)ను స్వల్ప కాలానికే పరిమితం చేయవచ్చు. నిర్మాణ రంగం పుంజుకోవడం, జీఎస్టీ వసూళ్లు పెరగడం వంటి అంశాలు ర్యాలీకి బలాన్నిచ్చే వీలుంది. ఈ బాటలో ఇకపై సిమెంటుకు డిమాండ్, ఇంధన విక్రయాలు వంటివి ఊపందుకుంటే సెంటిమెంటు మరింత మెగుగుపడవచ్చు. ఇది ర్యాలీకి మరింత దోహదం చేయవచ్చు. ఫేవరెట్ స్టాక్స్ ప్రస్తుత మార్కెట్లో వేల్యుయేషన్స్‌పరంగా ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొంతమేర ఆకర్షణీయంగా ఉన్నట్లు జెఫరీస్ అభిప్రాయపడింది. -
టెలికం- ఆటో.. మురిపిస్తాయ్!
ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న భారీ ప్యాకేజీలతో వ్యవస్థలో లిక్విడిటీ బాగా పెరిగిందని మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ రీసెర్చ్ హెడ్, సిద్ధార్ధ్ ఖేమ్కా పేర్కొంటున్నారు. నామమాత్ర వడ్డీ రేట్ల కారణంగా చౌన నిధులు స్టాక్ మార్కెట్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కొద్ది రోజులుగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు పరుగు తీస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దాం.. నాస్డాక్ జోరు గత రెండు వారాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం జోరు చూపుతున్నాయి. ఇందుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు సైతం దోహదపడుతున్నాయి. ఈ నెలలోనే ఇటీవల రూ. 15,000 కోట్లవరకూ ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. దీంతో గత రెండు వారాల్లోనే మార్కెట్లు 12-13 శాతం ఎగశాయి. ఇక గ్లోబల్ మార్కెట్లు సైతం లిక్విడిటీ దన్నుతో పరుగు తీస్తున్నాయి. మార్చి కనిష్టాల నుంచి అమెరికన్ ఇండెక్స్ నాస్డాక్ 45 శాతం జంప్ చేసింది. తాజాగా సరికొత్త రికార్డ్ గరిష్టాన్ని చేరుకుంది. ఇదే విధంగా ఎస్అండ్పీ, డోజోన్స్ ర్యాలీ చేస్తున్నాయి. వీటితో పోలిస్తే దేశీ మార్కెట్లు కొంత వెనకబడ్డాయి. ఫలితాలవైపు సమీప కాలంలో మార్కెట్లు కంపెనీల ఫలితాలవైపు దృష్టిసారించవచ్చు. అయితే కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్ అమలు, నిలిచిపోయిన పారిశ్రామికోత్పత్తి, డిమాండ్ క్షీణత వంటి అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాలపై అంచనాలు తక్కువే. వీటిని ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసుకుంది. నిజానికి 2021 అంచనాలతో పోలిస్తే 21 పీఈలో మార్కెట్లపట్ల అంత భరోసా ఉండకపోవచ్చు. దీంతో ఈ స్థాయిల నుంచి మార్కెట్లు తదుపరి దశ ర్యాలీలోకి ప్రవేశించేముందు కొంతమేర కన్సాలిడేషన్ లేదా.. పతనానికి అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డవున్ ఎత్తివేయడం, ఆర్థిక వ్యవస్థలు తిరిగి పట్టాలెక్కుతుండటం వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చే వీలుంది. దీనికితోడు అంతర్జాతీయ స్థాయిలో రెండో దశ ప్యాకేజీలు వెలువడితే.. లిక్విడిటీ మరింత పెరగవచ్చు. ఎయిర్టెల్ భేష్ కోవిడ్-19.. ఫైనాన్షియల్ రంగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నదీ వేచిచూడవలసి ఉంది. ప్రస్తుత వాతావరణంలో మొబైల్ టెలికం రంగం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ రంగంలో భారతీ ఎయిర్టెల్ కౌంటర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. క్రమంగా ఏఈర్పీయూలు బలపడుతుండటం ఈ కౌంటర్‌కు హుషారునిస్తోంది. ఇప్పటికే రూ. 125 స్థాయి నుంచి ఏఆర్పీయూలు రూ. 150కు పుంజుకున్నాయి. అత్యధిక శాతం వినియోగదారులు 2జీ నుంచి 4జీకు మారడం కంపెనీకి కలిసొస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం 4జీ సేవలకు డిమాండ్ పెరుగుతుండటం సానుకూల అంశం. సమీప భవిష్యత్‌లో పెట్టుబడి వ్యయాల అవసరం తగ్గడంతో క్యాష్‌ఫ్లోలు మెరుగుపడే వీలుంది. ఇటీవల రిలయన్స్ జియోపట్ల విదేశీ సంస్థల ఆసక్తిని గమనిస్తే.. దేశీ టెలికం, డిజిటల్ రంగానికున్న అవకాశాలను అంచనా వేయవచ్చు. టెలికంకు సాంకేతికను జోడించడం ద్వారా డిజిటల్ అవకాశాలు పెంచుకోవచ్చు. దీనికితోడు ఇప్పటికే దేశీయంగా టెలికం రంగంలో కన్సాలిడేషన్ జరిగింది. మూడు ప్రధాన కంపెనీలు మాత్రమే సేవలందిస్తున్నాయి. ఫలితంగా టెలికం కంపెనీలకు భారీ అవకాశాలు లభించవచ్చని భావిస్తున్నాం. ఆటో.. గ్రీన్‌సిగ్నల్ స్టాక్ మార్కెట్ దృష్టితో చూస్తే.. గ్రామీణ ప్రాంత వినియోగానికి ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే రబీ సీజన్ జోరందుకుంది. ఇటీవల వాతావరణ శాఖ వెలువరించిన అంచనాల ప్రకారం నైరుతీ రుతుపవనాలు ఆశలు రేపుతున్నాయి. ఈసారి తగిన సమయానికే రుతుపవనాలు రావడంతోపాటు.. సాధారణ సగటు వర్షపాతానికి చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. ప్రభుత్వం సైతం ఎంజీఎన్ఆర్ఈజీఏకు అధిక కేటాయింపులు చేసింది. కనీస మద్దతు ధరలనూ పెంచుతోంది. వలస కూలీలు, శ్రామికుల నుంచి సైతం డిమాండ్ కనిపించే వీలుంది. ఈ నేపథ్యంలో ట్రాక్టర్, ద్విచక్ర వాహన తయారీ కంపెనీలతోపాటు, గ్రామీణ ఫైనాన్సింగ్, ఫెర్టిలైజర్, ఆగ్రో కెమికల్ కంపెనీల బిజినెస్‌లు వృద్ధి చూపే అవకాశముంది. ప్రధానంగా ట్రాక్టర్లు, ద్విచక్ర వాహన విక్రయాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ను ప్రతిబింబిస్తాయి. ఎంఅండ్ఎం ఆటో రంగంలో మహీంద్రా(ఎంఅండ్ఎం) ఆసక్తికరంగా కనిపిస్తోంది. కంపెనీ నిర్వహణలోని మూడు కీలక బిజినెస్‌లలో రెండు పటిష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యధికంగా అమ్మకాలు సాధించడంలో సఫలంకాగలదని అంచనా. కోవిడ్-19 పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. దీంతో రెండేళ్ల కాలంలో ఆదాయంలో 60 శాతం, నికర లాభాల్లో 80 శాతం వరకూ గ్రామీణ ప్రాంతాల నుంచి సమకూర్చుకోగలదని అంచనా వేస్తున్నాం. ఇక ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటో, బజాజ్ ఆటోను ప్రస్తావించవచ్చు. ఎగుమతులు, త్రిచక్ర వాహన మార్కెట్ కారణంగా బజాజ్ ఆటోతో పోలిస్తే.. హీరోమోటోకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. -
ఇక్కడా స్కామ్లుంటాయ్ జాగ్రత్త!
దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లు లాభాలను అందిస్తాయనీ, ఈక్విటీలను మించిన సాధనం మరొకటి లేదని తరచుగా మార్కెట్ నిపుణులు చెపుతుంటారు. కాని ఈ మాటలతో నేను పూర్తిగా విభేదిస్తాను. కంపెనీ ఫండమెంటల్స్, ఈపీఎస్‌లను పూర్తిగా చదివి పెట్టుబడి పెట్టినా... నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి మార్కెట్ కుంభకోణాలు. ఇప్పుడు తాజాగా నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్లో భారీ కుంభకోణం వెలుగు చూడటంతో నా అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సొంతూరులో వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉన్నా... ఉద్యోగం చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను మండపేట నుంచి హైదరాబాద్ చేరుకున్నా. ఇది 1980నాటి మాట. ఎంకాం పూర్తిచేశాక భాగ్యనగరంలో ఒక చిన్న ఉద్యోగంలో చేరా. పంటల మీద వచ్చే డబ్బుకి తోడు ఖర్చులకు ఎలాగూ జీతం ఉండటంతో నా దృష్టి స్టాక్ మార్కెట్‌పై పడింది. చిన్నగా షేర్లు కొనడం మొదలు పెట్టా. సెకండరీ మార్కెట్లో భారీ లాభాలు కాకపోయినా ఒక మోస్తరు లాభాలు వచ్చాయి. అప్పట్లో వారానికి 15 నుంచి 20 పబ్లిక్ ఇష్యూలు వచ్చేవి. నెమ్మదిగా వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టా. దీంతో నా దగ్గర ఉన్నదీ, సంపాదిస్తున్నదీ అంతా మార్కెట్లో పెట్టుబడిగా వెళ్లిపోయింది. ఒక స్వల్ప లాభం కళ్ల చూసే లోగా ఇంతలో భారీ నష్టం వచ్చేది. ఇదంతా సహజమే కదా అని సరిపెట్టుకునే వాడిని. ఇలా సాగిపోతున్న తరుణంలో అంతవరకు పరిచయం లేని ఒక పదం నా ట్రేడింగ్ జీవితంలోకి ప్రవేశించింది. అదే కుంభకోణం! స్టాక్ మార్కెట్లు కూడా కుంభకోణాలకు అతీతం కాదని తొలిసారిగా తెలిసింది. ఒక్కసారిగా బద్దలైన హర్షద్ మెహతా కుంభకోణం నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేసింది. ఆ దెబ్బతో షేర్లు అధఃపాతాళానికి చేరిపోయాయి. ఈపీఎస్ చదివి పెట్టుబడి పెట్టినా పీస్ లేకుండా చేశాయి. బుక్ వేల్యూ చూసినా నా పేపర్ సర్టిఫికెట్‌కి వేల్యూ లేకపోవడంతో అవి నన్ను వెక్కిరించాయి. ఇలాంటి పతనంలో కూడా యథావిధిగా పత్రికలు, బ్రోకర్లు.. షేర్లు ఫండమెంటల్‌గా చాలా స్ట్రాంగ్ ఉన్నాయని, ఇంకా కొనమంటూ సలహా ఇచ్చాయి. ఉన్న షేర్లు అమ్మితే కొన్న ధరలో వందో వంతు కూడా రాని పరిస్థితి అది. కాలం కలిసి రాకపోతే ఇంతే అని సరిపెట్టుకొని తిరిగి సంపాదించుకోగలను అన్న నమ్మకంతో మార్కెట్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. ఇంతలో కేతన్ పరేఖ్ రూపంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. వరుసగా రెండో దెబ్బ పడటంతో తట్టుకోవడం నా వల్ల కాలేదు. లక్ష రూపాయల్లో ఉండే షేర్ల విలువ వందల్లోకి వచ్చేసింది. ప్రైమరీ మార్కెట్లో అలాట్ అయిన షేర్లు చిన్న లాభాలతో ట్రేడ్ అవుతుంటే కేతన్ పరేఖ్ దెబ్బకి వాటి అడ్రస్‌లే గల్లంతయ్యాయి. ఇప్పటికీ నా దగ్గర స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడ్ కాని చాలా షేర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో నేను అంతకుముందు సంపాదించినదంతా కోల్పోయాను. ఇక్కడ నేను చెప్పదల్చుకున్నదల్లా ఒక్కటే... ఎన్ని ఫండమెంటల్స్ చూసి ఇన్వెస్ట్ చేసినా... ఒక్క కుంభకోణం బయటపడితే ఇన్వెస్ట్మెంట్ అంతా ఆవిరైపోతుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కుంభకోణాలు అనే రిస్క్ కూడా ఎప్పుడూ పొంచి ఉంటుందన్న విషయం మర్చిపోవద్దన్నదే నా సలహా. - జీఆర్కే, మండపేట