కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి మరింత క్షీణించాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 518 పాయింట్లు కోల్పోయి 37,088 కు చేరగా.. నిఫ్టీ 140 పాయింట్ల వెనకడుగుతో 10,933ను తాకింది. తద్వారా సెన్సెక్స్ 37,000 పాయింట్లవైపు కదులుతుంటే .. నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్ దిగువన ట్రేడవుతోంది.
ఐటీ, రియల్టీ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్ బ్యాంక్స్ 2.25 శాతం నీరసించగా.. ఐటీ, రియల్టీ దాదాపు 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. అయితే ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ రంగాలు 1.25 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, టైటన్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, హిందాల్కో, ఎస్‌బీఐ, ఐషర్, బీపీసీఎల్ 5-0.5 శాతం మధ్య ఎగశాయి. అయితే యూపీఎల్, ఇండస్‌ఇండ్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఆటో, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, ఐవోసీ, ఆర్‌ఐఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హీరో మోటో 6-1.6 శాతం మధ్య క్షీణించాయి.
చిన్న షేర్లు ఓకే
బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3-0.9 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1316 లాభపడగా.. 1069 నష్టాలతో కదులుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బంధన్ బ్యాంక్ 10 శాతం కుప్పకూలగా.. అపోలో హాస్పిటల్స్, ఆర్‌బీఎల్, ఎస్‌బీఐ లైఫ్, ఎస్కార్ట్స్, ఐబీ హౌసింగ్ 3.6-2.7 శాతం మధ్య డీలాపడ్డాయి. కాగా.. మైండ్‌ట్రీ, ఐడియా, దివీస్, టైటన్, పీఎన్‌బీ, టొరంట్ ఫార్మా, బీఈఎల్, మదర్‌సన్ 5-2.2 శాతం మధ్య ఎగశాయి.
Comments
Please login to add a commentAdd a comment