
ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ముగింపు సమయానికి వచ్చే సరికి నెమ్మదిగా నష్టాల వైపు పయనించాయి. చివరకు సెన్సెక్స్ 13.50 పాయింట్లు(0.03%) క్షీణించి 52372.69 వద్ద ముగిస్తే, నిఫ్టీ 2.80 పాయింట్లు (0.02%) పెరిగి 15692.60 వద్ద స్థిర పడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.57 వద్ద నిలిచింది. ఇక మార్కెట్లో ఈ రోజు అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్స్, జెఎస్ డబ్ల్యు స్టీల్ మరియు ఎస్ బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. అయితే, అదానీ పోర్ట్స్, భారతి ఎయిర్ టెల్, బిపిసిఎల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment