ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిసాయి. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాట పట్టినప్పటికీ.. దేశీయ మార్కెట్లు మాత్రం లాభాలతో ముగిసాయి. ఇవాళ 50,258 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 50,439 వద్ద గరిష్ఠాన్ని.. 49,807 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 50,296 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఉదయం 14,865 వద్ద ట్రేడింగ్ ఆరంభించిన నిఫ్టీ చివరకు 157 పాయింట్లు లాభంతో 14,919 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.38గా ఉంది. సెన్సెక్స్ టాప్ 30లో ఐదు కంపెనీలు మినహా మిగిలిన సంస్థల షేర్లన్నీ లాభాలను ఒడిసిపట్టాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, విప్రో లిమిటెడ్, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడగా.. ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్ని చవిచూశాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment