
ముంబై : బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో సెన్సెక్స్ 282 పాయింట్లు కోల్పోయి 52, 306 పాయింట్ల వద్ద మార్కెట్ క్లోజ్ అయ్యింది. జూన్ 22న ఆల్‌టైం హై 53 వేల పాయింట్లను దాటిన సెన్సెక్స్ అదే రోజు సాయంత్రం 52,558 దగ్గర క్లోజైంది. అయితే ఈ రోజు ఉదయం 52,912 పాయింట్లతో మార్కెట్ ఓపెన్ అయ్యింది. మరోసారి ఆల్‌టైం హై నమోదు అవుతుందేమో అనిపించినా ఆ తర్వాత క్రమంగా పాయింట్లు కోల్పోతూ ఒక దశలో 52, 264 పాయింట్లకు చేరుకుంది. మార్కెట్ ముగుస్తుందనగా మరోసారి పుంజుకుని చివరకు 52,306 పాయింట్ల దగ్గర క్లోజైంది. నిన్నటితో పోల్చితే మొత్తం 282 పాయింట్లు కోల్పోయింది.
నిఫ్టీ
ఎన్‌ఎస్‌సీ నిఫ్టీ 85 పాయింట్లు కోల్పోయి 15,686 పాయింట్ల వద్ద క్లోజైంది. నిఫ్టీ ఈ రోజు 15,862 పాయింట్లలో మొదలై 15,82 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత 15,673 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment