After Blinkit Deal Zomato Value Shed Nearly One Billion Dollars - Sakshi
Sakshi News home page

బ్లింకిట్‌ డీల్‌: జొమాటోలో వేల కోట్ల రూపాయలు హాంఫట్‌

Published Tue, Jun 28 2022 3:33 PM | Last Updated on Tue, Jun 28 2022 4:03 PM

After Blinkit DealZomato Value sheds Nearly one Billion dollars - Sakshi

బెంగళూరు: ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోకు భారీ షాక్‌ తగిలింది. కిరాణా డెలివరీ స్టార్టప్ బ్లింకిట్‌ను కొనుగోలు  ఒప్పందం  ప్రకటించిన  తరువాత దాదాపు ఒ‍క బిలియన్  డాలర్ల మేర కోల్పోయింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ భారీ నష్టాన్న చవి చూసింది. ఈ డీల్‌పై పెట్టుబడిదారులు ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో జొమాటో లిమిటెడ్ షేర్లు వరుసగా రెండవ రోజు నష్టపోయి మంగళవారం  8.2 శాతం వరకు పతమైంది. మొత్తం రెండు రోజుల్లో 14.07 శాతం నష్టపోయింది. 

కాగా యాంట్ గ్రూప్-ఆధారిత ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రూ. 4,447 కోట్ల (568.16 మిలియన్‌ డాలర్లు) డీల్‌ను శుక్రవారం వెల్లడించింది. షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకోనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. తీవ్రమైన  పోటీలో నిలదొక్కుకుని, మార్కెట్‌లో పట్టు సాధించే  ప్రక్రియలో ఈ డీల్‌ కుదుర్చుకుంది. 

ఇది కూడా చదవండి: Indian Rupee Vs US Dollar: రూపాయి మరింత ఢమాల్‌! మున్ముందు మరింత కష్టం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement