న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీ భారత్‌పే గ్రూప్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) లో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు 50 శాతం తగ్గి రూ. 474 కోట్లకు పరిమితమయ్యాయి.
అంతక్రితం ఏడాది(2022–23)లో రూ. 941 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం జంప్‌చేసి రూ. 1,426 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది రూ. 1,029 కోట్ల టర్నోవర్ మాత్రమే అందుకుంది. కంపెనీ 2024 అక్టోబర్‌లో పాజిటివ్ ఇబిటా సాధించినట్లు భారత్‌పే సీఈవో నళిన్ నేగి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment