టెక్నాలజీ పెరుగుతున్నంత వేగంగా.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించుకునేవారు టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ దాడుల్లో కోట్ల కొద్దీ డబ్బు పోగొట్టుకున్న సంఘటనలు గతంలో చాలానే తెలుసుకున్నాం. అలాంటి మరో సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఇందిరాపురం నివాసితులైన నబనిత, మృణాల్ మిశ్రా ఫేస్‌బుక్‌లో ఏకంగా రూ.3.1 కోట్లు నష్టపోయారు. స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి అంటూ ఈ దంపతులను మోసం చేసి.. సైబర్ నేరగాళ్లు జూలై, ఆగస్టు మధ్య కాలంలో వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.
నిజానికి నబానితా మిశ్రా ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన చూసి దానిపైన క్లిక్ చేసింది. ఆ తరువాత వ్యాపార సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న వాట్సాప్ గ్రూప్‌లో ఆమెను యాడ్ చేశారు. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ రజత్ చోప్రా జీటీసీ అనే పోటీలో పాల్గొనమని సభ్యులను ప్రోత్సహించారు.
ఇన్వెస్ట్‌మెంట్ సలహా కోసం మొదట నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 2,000 చెల్లించానని.. ఆపై షేర్లు, ఐపిఓ ఇన్వెస్ట్‌మెంట్‌లకు కూడా బదిలీలు చేయాలని చెప్పారు. అప్పటికే వాట్సాప్ గ్రూప్‌లో ఇతరులు తమ పెట్టుబడులపై లాభాలను అందుకున్నట్లు వివరించారు.
ఐపీవో లావాదేవీలలో ఒకదాని కోసం కంపెనీ తనకు రూ. 80 లక్షలు అప్పుగా ఇచ్చిందని నబానితా మిశ్రా తెలిపారు. ఆమె తన ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ డబ్బును తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. అలా చేయడానికి ఆమె తన తండ్రి ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాలను తనఖా పెట్టింది. ఆ తరువాత ఒక అకౌంట్ యాక్సెస్ చేయగలిగింది. కంపెనీ యాప్‌లో ఆమె పెట్టుబడులు, లాభాల వివరాలను చెక్ చేసుకోగలిగింది. కానీ డబ్బును మాత్రం విత్ డ్రా చేయలేకపోయింది. ఆ తరువాత ఆమెకు అనుమానం వచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా కాల్ చేసినప్పుడు అవన్నీ స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment