న్యూఢిల్లీ: ఏసీలు, ఇంజినీరింగ్ సర్వీసుల దిగ్గజం వోల్టాస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతంపైగా నీరసించి రూ. 110 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 122 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 55 శాతం జంప్‌చేసి రూ. 2,768 కోట్లను తాకింది.
అయితే మొత్తం వ్యయాలు సైతం 57 శాతం పెరిగి రూ. 2,603 కోట్లను దాటాయి. యూనిటరీ కూలింగ్ ప్రొడక్టుల నుంచి ఆదాయంలో రూ. 2,162 కోట్లు సమకూరింది. ఇది రెట్టింపునకుపైగా వృద్ధికాగా.. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టులు, సర్వీసుల నుంచి 34 శాతం తక్కువగా రూ. 455 కోట్లు లభించింది. ఇక ఇంజినీరింగ్ సరీ్వసుల నుంచి 8 శాతం అధికంగా రూ. 124 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఫలితాల నేపథ్యంలో వోల్టాస్ షేరు బీఎస్‌ఈలో యథాతథంగా రూ. 1,000 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment