ప్చ్‌.. వాల్‌మార్ట్‌ ఇండియాకు పెరిగిన నష్టాలు  | Walmart India FY22 loss widens to Rs 299 cr revenue up 7pc | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. వాల్‌మార్ట్‌ ఇండియాకు పెరిగిన నష్టాలు 

Published Tue, Nov 1 2022 11:37 AM | Last Updated on Tue, Nov 1 2022 11:39 AM

Walmart India FY22 loss widens to Rs 299 cr revenue up 7pc - Sakshi

న్యూఢిల్లీ: బెస్ట్‌ప్రైస్‌ ఫ్లిప్‌కార్ట్‌ స్టోర్ల నిర్వాహక దిగ్గజం వాల్‌మార్ట్‌ ఇండియా మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ. 299 కోట్ల నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2020-21)లో రూ. 201 కోట్ల నష్టం ప్రకటించింది.

బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ వివరాల ప్రకారం కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 6 శాతంపైగా పుంజుకుని రూ. 5,362 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 8 శాతం పెరిగి రూ. 5,660 కోట్లను తాకాయి.

వాల్‌మార్ట్‌ ఇండియాలో 100 శాతం వాటాను ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 2020 జులైలో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాల్‌మార్ట్‌ ఇండియా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో 29 బెస్ట్‌ప్రైస్‌ ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ స్టోర్లు, 2 ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలను నిర్వహిస్తోంది. కాగా ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ను యూఎస్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ 2018 మే నెలలో 16 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement