ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి తర్జాతీయ సూచీలు నెగటివ్‌గా స్పందిస్తున్నాయి. అదే ప్రభావం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలపై కూడా పడింది. ఆర్థిక వ్యవస్థ రికవరీపై సందేహాలతకు తోడు కోవిడ్ కేసులు పెరగడం కూడా ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేసింది. దీంతో మార్కెట్ ప్రారంభం అవగానే ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో స్టాక్ మార్కెట్లు వరుసగా పాయింట్లు కోల్పోతూ వచ్చాయి.
ఈరోజు ఉదయం 52,606 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వరుసగా పాయింట్లు కోల్పోతూ కనిష్టంగా 52,405 పాయింట్లకు పడిపోయింది. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య గరిష్టంగా 52,821 పాయింట్లను తాకింది. రోజు మొత్తంలో దశలోనూ నిన్నటి గరిష్ట స్థాయికి చేరుకోలేకపోయింది. సాయంత్రానికి 586 పాయింట్లు కోల్పోయి 52,553 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం 15,800 పాయింట్లు దాటిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈరోజు 171 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 15,752 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభపడగా నెస్టల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment