
గ్లోబల్ మార్కెట్ల డౌన్‌ట్రెండ్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి.
ముంబై : గ్లోబల్ మార్కెట్ల బలహీన ట్రెండ్‌తో పాటు కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంపై అంచనాలతో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. రియల్ ఎస్టేట్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టాటా స్టీల్, కొటాక్ మహీంద్ర బ్యాంక్, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 41,388 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 51 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,196 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.