
స్టాక్ మార్కెట్‌ను నష్టాల బాట వీడటం లేదు..ఎఫ్‌అండ్‌ఓ సిరీస్ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు నెగెటివ్ జోన్‌లోకి వెళ్లాయి..
ముంబై : స్టాక్ మార్కెట్‌ను వరుస నష్టాలు వీడటం లేదు. ఎఫ్‌అండ్‌ఓ ఆగస్ట్ సిరీస్ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. యస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోతున్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ 173 పాయింట్ల నష్టంతో 37,280 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 10,990 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.