Fuel Company Declared 4 Days Work Week With 3 Offs - Sakshi
Sakshi News home page

ఈ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్‌, ‘వారానికి 4 రోజులే ప‌ని’

Published Sat, Oct 29 2022 4:36 PM | Last Updated on Sat, Oct 29 2022 6:28 PM

Fuel Company Declared 4 Days Work Week With 3 Offs - Sakshi

దిగ్రేట్‌ రిజిగ్నేషన్‌, అట్రిషన్‌ రేట్‌ కారణంగా ఈ ఏడాది మార్చి -  ఏప్రిల్‌ నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు పని దినాల్ని కుదించాయి. వారానికి 6 రోజులు, ఆ తర్వాత 5 రోజులు, ఇప్పుడు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసే వెసలుబాటు  కల్పిస్తున్నామంటూ సంస‍్థలు ఆ సమయంలో ప్రకటించాయి. తాజాగా మరో కంపెనీ వారానికి 4 రోజులు పనిచేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. 

యూకేకు చెందిన సుమారు 100 కంపెనీలకు పైగా ఉద్యోగులతో వారానికి 4 రోజులు మాత్రమే పనిచేయించుకుంటున్నాయి. అలా చేయడం వల్ల వర్క్‌ ప్రొడక్టవిటీ పెరగడంతో పాటు, కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారని పేర్కొన్నాయి. 

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ప్లైమౌత్ సిటీలో మార్కెటింగ్‌ కార్యకలాపాలు నిర్వహించే ‘ఫ్యూయల్’ కంపెనీ ఆఫీస్‌ వర్కింగ్‌ డేస్‌ను 5 రోజుల నుంచి 4 రోజులకు తగ్గించింది. 2022 అక్టోబర్‌ నుంచి 2023 మార్చి నెల వరకు ఉద్యోగులు ఈ కొత్త పనిదినాల్లో పనిచేస్తారని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మార్టిన్‌ కింగ్‌ తెలిపారు. దిగ్గజ టెక్‌ కంపెనీలు గూగుల్‌, మెటా తరహాలో ఉద్యోగులకు పూర్తి స్థాయిలో శాలరీను అందిస్తామని అన్నారు. ఇక మార్నింగ్‌ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్‌ టైమింగ్స్‌ ఉంటున్నట్లు పేర్కొన్నారు. 

పనిగంటలు ఎక్కువే 
వారానికి 4 రోజుల పనిదినాలే అయినా.. రోజుకు సుమారు 10 పని గంటలు ఉండటంపై మార్టిన్‌ స్పందించారు. మా సంస్థకు ఎక్కువ మంది క్లయింట్లు ఈ-కామర్స్‌ రంగానికి చెందిన వారే. క్లయింట్ల అవసరాల్ని బట్టి వారి వర్క్స్‌ అవసరానికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు.  

2019 నుంచి వారానికి 4 రోజుల పని
ఫ్యూయల్ , పోర్ట్‌కల్లిస్ లీగల్‌ గ్రూప్‌ సంస్థలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే పోర్ట్‌ కల్లిస్‌ సంస్థ 2019 నుంచి వారానికి  4 రోజుల దినా​ల్ని ప్రవేశ పెట్టారు.

చదవండి👉 నువ్వూ వద్దు..నువ్విచ్చే జీతమూ వద్దు, రూ.8కోట్లు వద్దన్న ఉద్యోగి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement