Marketing Companies
-
యాడ్స్ కోసం ఎంతకు తెగించింది ఈ కంపెనీ..?
ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీల ఆగడాలు శృతి మించుతన్నాయి. సాధారణంగా ఇంటర్నెట్లో యూజర్ల ప్రవర్తన ఆధారంగా కంపెనీలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో లక్షిత యాడ్స్‌ను ప్రదర్శిస్తుంటాయి. అయితే వినియోగదారుల అభిరుచులను కనుగొనేందుకు కంపెనీలు యూజర్ల ఫోన్ సంభాషణలను వింటున్నాయని ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ కంపెనీ దీన్ని అంగీకరించింది. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.‘404 మీడియా’ నివేదిక ప్రకారం.. కాక్స్ మీడియా గ్రూప్ (Cox Media Group) అనే మార్కెటింగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మైక్రోఫోన్ల ద్వారా యూజర్లు ఏం మాట్లాడుతున్నారో వింటోంది. ఆ సంభాషణల ఆధారంగా ప్రకటనలు గుప్పిస్తున్నట్లు అంగీకరించింది. ఫేస్బుక్, గూగుల్ వంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌లు ఈ కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. యూజర్ల సంభాషణలు వినడానికి ఆ కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన యాక్టివ్ లిజెనింగ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నట్లు తమ ఇన్వెస్టర్లకు తెలిజేసింది.దీనిపై స్పందన కోరేందుకు 404 మీడియా సంప్రదించిన వెంటనే గూగుల్ తమ పార్ట్నర్ ప్రోగ్రామ్ వెబ్సైట్ నుంచి సదరు మార్కెటింగ్ సంస్థను తొలగించింది. ‘వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలతో పాటు గూగుల్ ప్రకటనల విధానాలకు ప్రకటనకర్తలందరూ కట్టుబడి ఉండాలి. ఈ విధానాలను ఉల్లంఘించే ప్రకటనలు లేదా ప్రకటనదారులను గుర్తించినప్పుడు, తగిన చర్య తీసుకుంటాం" అని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు ‘న్యూయార్క్ పోస్ట్’పేర్కొంది. -
ఈ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్, ‘వారానికి 4 రోజులే పని’
దిగ్రేట్ రిజిగ్నేషన్, అట్రిషన్ రేట్ కారణంగా ఈ ఏడాది మార్చి - ఏప్రిల్ నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు పని దినాల్ని కుదించాయి. వారానికి 6 రోజులు, ఆ తర్వాత 5 రోజులు, ఇప్పుడు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసే వెసలుబాటు కల్పిస్తున్నామంటూ సంస్థలు ఆ సమయంలో ప్రకటించాయి. తాజాగా మరో కంపెనీ వారానికి 4 రోజులు పనిచేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. యూకేకు చెందిన సుమారు 100 కంపెనీలకు పైగా ఉద్యోగులతో వారానికి 4 రోజులు మాత్రమే పనిచేయించుకుంటున్నాయి. అలా చేయడం వల్ల వర్క్ ప్రొడక్టవిటీ పెరగడంతో పాటు, కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ప్లైమౌత్ సిటీలో మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించే ‘ఫ్యూయల్’ కంపెనీ ఆఫీస్ వర్కింగ్ డేస్‌ను 5 రోజుల నుంచి 4 రోజులకు తగ్గించింది. 2022 అక్టోబర్ నుంచి 2023 మార్చి నెల వరకు ఉద్యోగులు ఈ కొత్త పనిదినాల్లో పనిచేస్తారని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ కింగ్ తెలిపారు. దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, మెటా తరహాలో ఉద్యోగులకు పూర్తి స్థాయిలో శాలరీను అందిస్తామని అన్నారు. ఇక మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైమింగ్స్ ఉంటున్నట్లు పేర్కొన్నారు. పనిగంటలు ఎక్కువే వారానికి 4 రోజుల పనిదినాలే అయినా.. రోజుకు సుమారు 10 పని గంటలు ఉండటంపై మార్టిన్ స్పందించారు. మా సంస్థకు ఎక్కువ మంది క్లయింట్లు ఈ-కామర్స్ రంగానికి చెందిన వారే. క్లయింట్ల అవసరాల్ని బట్టి వారి వర్క్స్ అవసరానికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. 2019 నుంచి వారానికి 4 రోజుల పని ఫ్యూయల్ , పోర్ట్కల్లిస్ లీగల్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే పోర్ట్ కల్లిస్ సంస్థ 2019 నుంచి వారానికి 4 రోజుల దినాల్ని ప్రవేశ పెట్టారు. చదవండి👉 నువ్వూ వద్దు..నువ్విచ్చే జీతమూ వద్దు, రూ.8కోట్లు వద్దన్న ఉద్యోగి -
మళ్లీ పెట్రో షాక్..
-
పెట్రోల్ గుండె గుభేల్
► పెట్రోల్‌పై కేంద్రం ఎడాపెడా బాదుడు మార్కెట్లో లీటరు పెట్రోల్ ధర ఎంత? అటూఇటుగా రూ.74.5.అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇది రోజూ మారుతుంటుంది. పెట్రోల్, డీజిల్ ధరల్ని నిజంగా అంతర్జాతీయ చమురు ధరలే ప్రభావితం చేస్తున్నాయా? అక్కడికి అనుగుణంగా ఇక్కడా పెరుగుతూ, తగ్గుతున్నాయా? సమాధానం కావాలంటే ఓ రెండంకెలు చూడాలి. 2014 మే నెలలో.. ♦ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర అత్యంత గరిష్టంగా బ్యారెల్ 109 డాలర్లకు చేరింది. అప్పుడు దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.81. 2017 సెప్టెంబర్‌లో... ♦ అంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్ 48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ఇప్పుడు లీటరు పెట్రోల్ ధర రూ.74.5 పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ల ప్రకారమే మారుతున్నాయనడం అబద్ధమనేందుకు పై రెండు ఉదాహరణలు చాలవూ...!! అసలు పెట్రోల్, డీజిల్ ధరల వెనక ఎవరి లాభమెంత? ప్రభుత్వ పన్నులెంత? దీనికి ఎవరి లాజిక్కేంటి? మొత్తంగా వినియోగదారుడు నష్టపోతున్నాడా, లేదా? (సాక్షి, బిజినెస్ విభాగం) : అంతర్జాతీయంగా ముడిచమురు ధరలకు పెరగటమే కాదు!! తగ్గటమూ తెలుసు. కానీ దేశీ ధరలకు మాత్రం పెరగటం మాత్రమే తెలుసు!! ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరల్ని మార్కెట్‌కు అనుసంధానించడం ద్వారా ధర తగ్గితే...ఆ ప్రయోజానాన్ని ప్రజలకు మళ్లిస్తామని నమ్మబలికిన ప్రభుత్వం.. అలా మిగిలే డబ్బుల్ని తన పన్నుల ఖాతాలో వేసేసుకుంటోంది. ఖజానాకు మళ్లిస్తోంది. పెరిగినప్పుడు మాత్రం ఆ భారం జనంపై వడ్డిస్తోంది. ఫలితమే తాజా పెట్రోల్, డీజిల్ ధరలు. ఇక జూన్ నెల్లో రోజువారీ ధరల్ని సవరించే విధానాన్ని ప్రవేశపెట్టాక ఇప్పటిదాకా పెట్రోల్ ధర ఏకంగా లీటరుకు తెలుగు రాష్ట్రాల్లో 8 రూపాయల వరకూ పెరిగిపోయింది. ఈ విధానం అమల్లోకి వచ్చాక ధర తగ్గిన రోజులు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ప్రపంచ మార్కెట్లో మాత్రం ముడి చమురు ధర గత ఆరు వారాల నుంచి 46–50 డాలర్ల మధ్య మాత్రమే హెచ్చుతగ్గులకు లోనవుతోంది. కేవలం 2–3 రోజులు మాత్రమే 50 డాలర్ల స్థాయిని దాటి మళ్లీ పడిపోయిన క్రూడ్ ప్రస్తుతం 48 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. కానీ మంగళవారంనాటి ధరల సవరణతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.74.51 వద్దకు, విజయవాడలో రూ.76.35 వద్దకు చేరింది. మూడేళ్ల తర్వాత పెట్రోల్ ధర ఈ స్థాయికి చేరటం ఇదే ప్రథమం. పన్నుల బాదుడే అసలు కారణం... 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు పెట్రోల్‌పై లీటరుకు ఎక్సయిజు సుంకం రూ.9.40. ఆ తరవాతి సంవత్సరాల్లో పదేపదే ఈ సుంకాన్ని పెంచేశారు. ఇపుడది ఏకంగా రూ.21.48కి చేరింది. డీజిల్‌పై సుంకం సైతం రూ.3.46 నుంచి రూ. 17.33కి చేరుకుంది. 2014 మేలో ప్రపంచ మార్కెట్లో 110 డాలర్లకు చేరిన ముడిచమురు బ్యారెల్ ధర... ఆ తరవాత నుంచి పతనమైంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించి దాన్ని తన ఘనతగా చెప్పుకుంది అప్పటి కొత్త సర్కారు. 2015 మొదట్లోనూ క్రూడ్ పతనం కొనసాగడంతో ఆ ఏడాది మధ్య నుంచి ఈ ప్రయోజనాన్ని ప్రజలకు అందించకుండా తన జేబులో వేసుకుంది. దీనికి తగ్గట్టుగా ఎక్సయిజు సుంకం పెంపును మొదలెట్టింది. అప్పటి నుంచి... ప్రపంచ ధరలతో సంబంధం లేకుండా ఇక్కడి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే.. తాము పెంచిన సుంకాల్ని వెనక్కితీసుకుంటామంటూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటు సాక్షిగా హామీ కూడా ఇచ్చారు. ఆ హామీ నెరవేరిన రోజులు ఇప్పటివరకూ లేవు. అక్కడ సగానికిపైగా తగ్గినా...: 2014 మే నెలలో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్‌కు 109 డాలర్లు పలకగా... భారతీయ రిఫైనరీలు దిగుమతి చేసుకునే ‘ఇండియన్ క్రూడ్ బాస్కెట్’ ధర రూ. 6,600 వరకూ వుండేది. అప్పట్లో లీటరు పెట్రోల్ రూ.81కి లభ్యమయ్యేది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో లైట్ స్వీట్ క్రూడ్ ధర 48 డాలర్లు. మనం దిగుమతి చేసుకునే ఇండియన్ బాస్కెట్ క్రూడ్ రూ.3,200. అంటే 2014 మేతో పోలిస్తే సగానికిపైగా తగ్గింది. కానీ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర 10 శాతమే తగ్గింది. ఎందుకంటే మిగిలిన మొత్తాన్ని పన్నులు పెంచేసి ప్రభుత్వం లాగేసుకుంది మరి!!. కేంద్రమే కాదు...రాష్ట్రాలు కూడా... అంతర్జాతీయంగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలను వినియోగదారులకు అందించకుండా పన్నుల పేరిట జేబులో వేసుకుంటున్నది కేంద్రం మాత్రమే కాదు. రాష్ట్రాలూ తమ చేతివాటం చూపిస్తూనే ఉన్నాయి. దేశంలో ఇంధనాలపై అత్యధిక వ్యాట్ విధిస్తున్న జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశంలో వీటి ధరలు తగ్గుతున్న సమయంలో ఈ రెండు రాష్ట్రాలూ వ్యాట్‌ను పెంచేశాయి. దీంతో పెట్రోల్‌పై వ్యాట్ 26% నుంచి 31%కి పెరిగింది. తెలంగాణలోకంటే ఆం«ధ్రప్రదేశ్ రెండాకులు ఎక్కువే చదివింది. అందుకే అక్కడ వ్యాట్ రెండు రూపాయిలు ఎక్కువ. ప్రస్తుతం పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎక్సయిజు సుంకాలు తగ్గించకపోగా, రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బహిరంగ వేదికల్లో కోరుతుండటం గమనార్హం. ఇక రాష్ట్రాలు సైతం కేంద్రం పన్నులు తగ్గిస్తే పెట్రో ధరలు తగ్గుతాయని అప్పుడప్పుడు చెబుతుంటాయి. అంటే! ఇద్దరూ ఇద్దరేనన్న మాట!!. కంపెనీలూ తక్కువ తినలేదు.. రోజువారీ ధరల సవరణ విధానం అమల్లోకి వచ్చాక 10 శాతం వరకూ పెట్రో ధర పెరగడానికి ప్రభుత్వ పన్ను పోటుతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు వాస్తవానికి ఈ మధ్య పన్నులు, సుంకాల్ని పెంచనప్పటికీ, అవి శాతం రూపంలో ఉన్నందున ధర పెరిగితే ఆ పన్నులు, సుంకాలు ఆటోమేటిగ్గా పెరిగిపోతుంటాయి. ఇక ప్రభుత్వాలకు తోడు పెట్రో మార్కెటింగ్ కంపెనీలు, రిఫైనరీలు కలిపి లీటరుకు ఒక రూపాయి లాభాన్ని ఎక్కువగా తీసుకుని... కలిసి పంచుకుంటున్నాయి. మెరుగైన ధరల విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా రూపాయి లాభాన్ని అదనంగా ప్రభుత్వ అనుమతితోనే అవి తీసుకుంటున్నాయి. మరోవైపు పెట్రో డీలర్ల కమిషన్ లీటరుకు 50 పైసల చొప్పున పెరిగింది. ముడి చమురు ధర మూడేళ్లుగా దిగివచ్చినా, బంకుల్లో మాత్రం మనకు ధరలు తగ్గకపోవటానికి... తిలా లాభం–తలా పిడికెడు అన్న మాట. మార్కెట్లో పెట్రోల్ ధర లీటరు రూ.74. కాకపోతే అంతర్జాతీయ మార్కెట్లో దీనికోసం పెడుతున్న ధర, ఇక్కడ రిఫైనింగ్, రవాణా ఖర్చులు... డీలర్ల కమీషన్, కంపెనీల లాభం... అంతా కలిపితే అయ్యేది రూ.29 మాత్రమే. మిగిలిన 45 రూపాయలేంటో తెలుసా? కేంద్ర రాష్ట్రాలు విధిస్తున్న పన్నులు. అందుకే అంతర్జాతీయంగా ఎంత తగ్గినా... మన బంకుల్లో మాత్రం ధర అదిరిపోతోంది. -
ఇక ఇంటి వద్దకే పెట్రోల్
► బుక్ చేసుకుంటే పెట్రోలియం ఉత్పత్తుల డోర్ డెలివరీ ► కేంద్ర చమురు శాఖ యోచన ► మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించే అవకాశం న్యూఢిల్లీ: ఇకపై.. పెట్రోల్ అయిపోతే బంకుల దాకా బండిని మోసుకెళ్లడమో లేదా బాటిల్ పట్టుకుని పెట్రోల్ బంకుకు పరిగెత్తడమో చేయక్కర్లేదు. ఎందుకంటే.. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను ఇంటి దగ్గరే అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదనపై కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ దిశగా పెట్రోలియం ఉత్పత్తుల డోర్–టు–డోర్ డెలివరీ సర్వీసులు అందించేలా ఈ–కామర్స్ విధానాన్ని పరిశీలించాలంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా విధానంతో వినియోగదారులకు పెట్రోల్ బంకుల్లో బారులు తీరడం, సమయం వృ«థా కావడం వంటి సమస్యలు తగ్గగలవని చమురు శాఖ పేర్కొంది. ఇటు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇది అటు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కూడా తోడ్పడగలదని భావిస్తున్నారు. మే 14 నుంచి పలు రాష్ట్రాల్లో బంకులను ఆదివారం మూసి ఉంచాలని బంకు ఓనర్లు యోచిస్తున్న నేపథ్యంలో తాజా ఆన్లైన్ బుకింగ్, డోర్ డెలివరీ విధానం ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. బంకులకు రోజూ 3.5 కోట్ల మంది: దేశీయంగా 2016–17 ఆర్థిక సంవత్సరంలో 23.8 మిలియన్ టన్నుల పెట్రోల్, 76 మిలియన్ టన్నుల డీజిల్ వినియోగం జరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ వినియోగం 21.8 మిలియన్ టన్నులు, డీజిల్ వినియోగం 74.6 మిలియన్ టన్నులే. ఇక నివేదికల ప్రకారం .. వాహనాల్లో ఇంధనం నింపుకోవడం కోసం ప్రతి రోజు 3.5 కోట్ల మంది వాహనదారులు పెట్రోల్ బంకులకు వస్తుంటారని అంచనా. ఇక గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి.. తృతీయ శ్రేణి పట్టణాల్లోనైతే బంకుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి.. నిర్ధిష్ట సమయాల్లో పెట్రోల్ బంకుల్లో రద్దీ భారీగా పెరిగిపోతుంది. పెట్రోల్ బంకుల్లో ఏటా రూ. 2,500 కోట్ల విలువ చేసే లావాదేవీలు జరుగుతుంటాయి. ఇందులో సింహభాగం నగదే ఉంటోంది. అదే ఆన్లైన్ డెలివరీ ఆప్షన్ గానీ అందుబాటులోకి తెస్తే.. నగదు లావాదేవీల పరిమాణం గణనీయంగా తగ్గొచ్చని అంచనా. పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఎలక్ట్రానిక్ లావాదేవీలను ప్రోత్సహించడంపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టి పెట్టారు. పెట్రోల్ బంకుల్లో ఇంధన కొనుగోళ్ల కోసం క్రెడిట్/ డెబిట్ కార్డులు లేదా ఈ–వాలెట్లతో చెల్లింపులు జరిపే వారికి 0.75 శాతం డిస్కౌంటు ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆయన వెంటనే ఆమోదముద్ర వేశారు. పెద్ద యెత్తున పెట్రోల్ బంకుల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్లను అందుబాటులోకి తేవడం జరిగింది. దేశవ్యాప్తంగా 86 శాతం బంకుల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. డీమోనిటైజేషన్ వ్యవధిలో పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలు రోజుకు రూ. 150 కోట్లకు తగ్గిపోయాయి. అయితే, రీమోనిటైజేషన్ ప్రక్రియ జరుగుతున్న కొద్దీ రోజువారీ నగదు లావాదేవీలు మళ్లీ రూ. 400 కోట్లకు పెరిగాయి.