ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీల ఆగడాలు శృతి మించుతన్నాయి. సాధారణంగా ఇంటర్నెట్‌లో యూజర్ల ప్రవర్తన ఆధారంగా కంపెనీలు వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియాలో లక్షిత యాడ్స్‌ను ప్రదర్శిస్తుంటాయి. అయితే వినియోగదారుల అభిరుచులను కనుగొనేందుకు కంపెనీలు యూజర్ల ఫోన్ సంభాషణలను వింటున్నాయని ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ కంపెనీ దీన్ని అంగీకరించింది. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.
‘404 మీడియా’ నివేదిక ప్రకారం.. కాక్స్ మీడియా గ్రూప్ (Cox Media Group) అనే మార్కెటింగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మైక్రోఫోన్‌ల ద్వారా యూజర్లు ఏం మాట్లాడుతున్నారో వింటోంది. ఆ సంభాషణల ఆధారంగా ప్రకటనలు గుప్పిస్తున్నట్లు అంగీకరించింది. ఫేస్‌బుక్, గూగుల్ వంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌లు ఈ కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. యూజర్ల సంభాషణలు వినడానికి ఆ కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన యాక్టివ్ లిజెనింగ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నట్లు తమ ఇన్వెస్టర్లకు తెలిజేసింది.
దీనిపై స్పందన కోరేందుకు 404 మీడియా సంప్రదించిన వెంటనే గూగుల్ తమ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ వెబ్‌సైట్ నుంచి సదరు మార్కెటింగ్ సంస్థను తొలగించింది. ‘వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలతో పాటు గూగుల్ ప్రకటనల విధానాలకు ప్రకటనకర్తలందరూ కట్టుబడి ఉండాలి. ఈ విధానాలను ఉల్లంఘించే ప్రకటనలు లేదా ప్రకటనదారులను గుర్తించినప్పుడు, తగిన చర్య తీసుకుంటాం" అని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు ‘న్యూయార్క్ పోస్ట్’
పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment