లాక్‌డౌన్‌ 2.0 : ఆర్‌బీఐ కీలక నిర్ణయం | RBI Keeps Banking Hours Curtailed Till April 30 | Sakshi
Sakshi News home page

30 వరకూ బ్యాంకుల పనిగంటలు కుదింపు

Published Thu, Apr 16 2020 5:52 PM | Last Updated on Thu, Apr 16 2020 5:53 PM

RBI Keeps Banking Hours Curtailed Till April 30 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి మే 3 వరకూ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించడంతో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నిబ్యాంకుల్లో బ్యాంకింగ్‌ వేళలను ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకూ కుదించిన క్రమంలో ఏప్రిల్‌ 30 వరకూ ఇదే సమయాన్ని పాటించాలని నిర్ణయించింది. మే 1 నుంచి మే 3 వరకూ మూడు రోజుల వరస సెలవుల అనంతరం మే 4న బ్యాంకులు తిరిగి ప్రారంభమయ్యే నాటికి బ్యాంకుల పనివేళలపై నిర్ణయాన్ని సమీక్షిస్తామని పేర్కొంది.

కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించేందుకు ఈనెల 7 నుంచి 17 వరకూ అన్ని నియంత్రిత మార్కెట్లలో పనివేళలను ఆర్‌బీఐ గతంలో సవరించగా, ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగించిన క్రమంలో సవరించిన పని గంటలను కొనసాగించాలని నిర్ణయించామని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

చదవండి : దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement