
రకుల్ ప్రీత్ సింగ్
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా అరడజను సినిమాలు (తమిళంలో ‘ఎన్‌జీకే, దేవ్’ శివకార్తికేయన్‌తో ఓ సినిమా’, బాలీవుడ్‌లో ‘దే దే ప్యార్‌దే’, మర్‌జవాన్, తెలుగులో ‘వెంకీమామ’) రకుల్ ప్రీత్ సింగ్ బ్యాంక్‌లో ఉన్నాయి. రీసెంట్‌గా ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ సినిమాలో ఆమె శ్రీదేవి పాత్రలో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘దేవ్, ఎన్‌జీకే, దే దే ప్యార్‌దే’ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
ఇలా ఇన్ని ప్రాజెక్ట్స్ షెడ్యూల్స్, డేట్స్, ప్రమోషన్స్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? మీకు అలసటగా అనిపించదా? అన్న ప్రశ్నలను రకుల్ ముందు ఉంచితే.. ‘‘మనం చేసే పనిని ప్రేమిస్తే ఎంత కష్టమైనా సులభంగానే అనిపిస్తుంది. వర్క్ కమిట్‌మెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కెరీర్‌కు ప్లస్ అవుతున్నప్పుడు ఎక్కువ టైమ్ వర్క్ చేయడంలో తప్పులేదు. ఒక్కోసారి లాంగ్ జర్నీ చేసి కూడా షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తుంది. అయినప్పటికీ నేను ఇబ్బంది ఫీలవ్వను. ఎందుకంటే రోజులో ఎక్కువ పని గంటలు ఉండటాన్ని ఇష్టపడతాను. ఆ పనిలోనే ఆనందం వెతుక్కుంటా’’ అని పేర్కొన్నారు రకుల్.
Comments
Please login to add a commentAdd a comment