ముస్లిం ఉద్యోగులకు పని వేళల కుదింపు | muslims working hours redused over ramzan | Sakshi
Sakshi News home page

ముస్లిం ఉద్యోగులకు పని వేళల కుదింపు

Published Sun, Jun 5 2016 2:18 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

muslims working hours redused over ramzan

సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు వీలుగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు పని వేళలను కుదించింది. అన్ని కార్యాలయాలు, పాఠశాలల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ గంట ముందుగా విధుల నుంచి వెళ్లేందుకు అనుమతిచ్చింది.

ఈ మేరకు శనివారం అన్ని కార్యాలయాలకు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా సర్క్యులర్ జారీ చేశారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులను ప్రభుత్వ పనిదినాలన్నింటా సాయంత్రం 4 గంటలకు విధుల నుంచి వెళ్లేందుకు అనుమతించాలని అందులో పేర్కొన్నారు. నెలవంకను బట్టి రంజాన్ మాసం ప్రారంభమయ్యే జూన్ 6 లేదా 7వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ వెసులుబాటును ఇస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement