
‘సినిమా రంగ అంబేద్కర్ దాసరి’
హైదరాబాద్: క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్లుగా దాసరికి ముందు, దాసరి తర్వాత అని చెప్పుకోవాల్సిందేనని, అంత గొప్పస్థానానికి దాసరి నారాయణరావు ఎదిగారని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో దర్శక రత్న దాసరి నారాయణ రావు కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన పార్ధీవ దేహాన్ని కిమ్స్ ఆస్పత్రిలో చూసిన అనంతరం నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ కుల,మత, లింగ, బడుగు, బలహీన వర్గాలు అనే తేడా లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి సినిమా రంగంలో జీవితాన్నిచ్చిన గొప్పవ్యక్తి దాసరి నారాయణరావు అని అన్నారు. సినిమా రంగంలో దాసరి ఒక అంబేద్కర్‌లాంటివారని చెప్పారు.