
సాక్షి, హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయే నాలుగు రోజుల ముందు కూడా మళ్లీ ఉదయం పేపర్ రావాలని కోరుకున్నారని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. దాసరి కోరిక మేరకు మళ్లీ ఏదో ఒక రూపంలో ‘ఉదయం’ రావాలని ఆశిస్తున్నానని చెప్పారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా దాసరి టాలెంట్ అకాడమీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం కాంపిటీషన్ బహుమతి ప్రదానోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తితోపాటు సినీనటులు మోహన్‌బాబు, జయసుధ, ఆర్.నారాయణమూర్తి, దర్శకనిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సి.కళ్యాణ్, హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామచంద్ర మూర్తి మాట్లాడుతూ.. ఈ రోజు లీడింగ్‌లో ఉన్న అన్ని తెలుగు పేపర్ల ఎడిటర్లు దాసరి పెట్టి ఉదయం పేపర్ నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి దాసరి నారాయణే కారణమని మంచు మోహన్ బాబు అన్నారు. 153 సినిమాలు చేసి ఎంతో మంది ఆర్టిస్టులను పరిచయం చేసిన మహా మనిషి దాసరి అని ఆర్ నారాయణ మూర్తి ప్రశంసించారు. దాసరికి పద్మభూషన్ ఇవ్వాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరాలని సీఎం కేసీఆర్‌ను వేడుకుంటున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment