dasari naryana rao
-
దాసరి లేని లోటు తెలుస్తోంది
‘‘కరోనా వల్ల ఇండస్ట్రీకి జరిగిన నష్టాన్ని దాసరిగారైతే మరోలా కాపాడేవారు. దాసరిగారిని తలుచుకోని రోజు లేదు’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. శనివారం దర్శకరత్న దాసరి నారాయణరావు 3వ వర్థంతి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్లో పలువురు సినీ ప్రముఖులు దాసరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘దాసరిగారు లేని లోటు కనిపిస్తోంది. వచ్చే ఏడాది మరింత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తాం’’ అన్నారు. ‘‘మేం దాసరిగారి దగ్గర పని చేయలేదు. అయినా ఆయన మనుషులం అని గర్వంగా చెప్పుకుంటాం’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘ప్రతి ఒక్కరికీ విలువ ఇచ్చి మాట్లాడేవారు దాసరిగారు. ఆయన స్థానాన్ని ఎవ్వరూ బర్తీ చేయలేరు’’ అన్నారు నిర్మాత ప్రసన్న కుమార్. ‘‘నేను బతికి ఉన్నంత కాలం దాసరిగారి జయంతి, వర్థంతి జరిగేలా చూస్తాం. ప్రతి ఏడాదీ దాసరి అవార్డ్స్ కొనసాగిస్తాం’’ అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. శ్రీకాంత్, రేలంగి నరసింహా రావు, రాజా వన్నెం రెడ్డి, తాండవ, పీడీవీ ప్రసాద్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 300 మందికి ఫుడ్ ప్యాకెట్లు, స్వీట్ ప్యాకెట్లు పంచిపెట్టారు రామసత్యనారాయణ. -
హరికృష్ణ, అక్కినేని విగ్రహాల తొలగింపు
సాక్షి, విశాఖపట్నం: ముందస్తు అనుమతిలేకుండా విశాఖలోని ఆర్కేబీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన మూడు విగ్రహాలను మున్సిపల్ అధికారులు సోమవారంఅర్థరాత్రి తొలగించారు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో మంత్రి గంట శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణ విగ్రహాలను బీచ్ రోడ్డులో ఏర్పాటు చేశారు. అయితే జీవీఎంసీ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ఈ విగ్రహాలను ఏర్పాటటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు ప్రజాసంఘాలు కోర్డును ఆశ్రయించాయి. దీంతో కోర్డు ఆ విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్త్ మధ్య జీవీఎంసీ అధికారులు ఆ మూడు విగ్రహాలను తొలగించారు. -
మళ్లీ ‘ ఉదయం’ వస్తుందని ఆశిస్తున్నా ’
సాక్షి, హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయే నాలుగు రోజుల ముందు కూడా మళ్లీ ఉదయం పేపర్ రావాలని కోరుకున్నారని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. దాసరి కోరిక మేరకు మళ్లీ ఏదో ఒక రూపంలో ‘ఉదయం’ రావాలని ఆశిస్తున్నానని చెప్పారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా దాసరి టాలెంట్ అకాడమీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం కాంపిటీషన్ బహుమతి ప్రదానోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తితోపాటు సినీనటులు మోహన్‌బాబు, జయసుధ, ఆర్.నారాయణమూర్తి, దర్శకనిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సి.కళ్యాణ్, హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్ర మూర్తి మాట్లాడుతూ.. ఈ రోజు లీడింగ్‌లో ఉన్న అన్ని తెలుగు పేపర్ల ఎడిటర్లు దాసరి పెట్టి ఉదయం పేపర్ నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి దాసరి నారాయణే కారణమని మంచు మోహన్ బాబు అన్నారు. 153 సినిమాలు చేసి ఎంతో మంది ఆర్టిస్టులను పరిచయం చేసిన మహా మనిషి దాసరి అని ఆర్ నారాయణ మూర్తి ప్రశంసించారు. దాసరికి పద్మభూషన్ ఇవ్వాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరాలని సీఎం కేసీఆర్‌ను వేడుకుంటున్నానన్నారు. -
మళ్లీ ‘ ఉదయం’ వస్తుందని ఆశిస్తున్నా ’
-
విష్ణు రియల్ కెరీర్ మొదలయ్యింది ఇప్పుడే
‘‘ఒక నటుడికి పది సంవత్సరాలు సమయం అనేది పరిశ్రమ గురించి తెలుసుకోవడానికే సరిపోతుంది. విష్ణుకు నటుడిగా పదేళ్లు నిండాయి. ఈ వ్యవధిలో పరిశ్రమ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఇప్పుడు తన రియల్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. దానికి ‘దూసుకెళ్తా’ నాంది పలకనుంది’’ అని దాసరి నారాయణరావు అన్నారు. మంచు విష్ణు కథానాయకుడిగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దూసుకెళ్తా’. అరియానా, వివియానా సమర్పణలో డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. దాసరి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని కె.రాఘవేంద్రరావుకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘తమిళనాడులో దర్శకులందరూ రచయితలే. అయితే... ఇప్పుడు తెలుగులో కూడా రచయితలు దర్శకులవుతున్నారు. వారిలో చెప్పుకోదగ్గ దర్శక, రచయిత వీరు పోట్ల. ‘బిందాస్’ చూసినప్పడే తను మంచి దర్శకుడవుతాడనుకున్నా. ఈ సినిమాను తను తప్పకుండా బాగా తీసుంటాడు’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘నా బిడ్డల గురించి నేను మాట్లాడను. వారి సినిమాలే మాట్లాడతాయి. వారి కష్టాలకు తగ్గ ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నా’’ అని మోహన్‌బాబు అన్నారు. విష్ణు మాట్లాడుతూ -‘‘ ‘రావణ’ పనిమీద అమెరికా వెళ్లాను. ఉన్నట్టుండి నాన్న నుంచి వెంటనే రమ్మని ఫోన్. రాగానే... వీరు పోట్లతో మనోజ్ ఈ కథ చెప్పించాడు. నాతో పాటు ఇంట్లో అందరికీ ఈ కథ నచ్చడంతో చేశాను. ఈ విషయంలో మనోజ్‌కు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా’’ అని చెప్పారు. ఇంకా మనోజ్, హన్సిక, మంచు లక్ష్మి, విరానికా, బి.గోపాల్, శ్రీను వైట్ల, బ్రహ్మానందం, అలీ, సునీల్, గిరిబాబు, రఘుబాబు, శ్రీవాసు, వరప్రసాదరెడ్డి, ప్రేమరక్షిత్, రజిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.