ఇన్ఫీలో లుకలుకలకు ఫుల్ స్టాప్?
ఇన్ఫీలో లుకలుకలకు ఫుల్ స్టాప్?
Published Mon, Feb 13 2017 11:18 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ ఇటీవల ఇన్ఫోసిస్ బోర్డులో నెలకొన్న లుకలుకలపై ఆ దిగ్గజ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ఫౌండర్ చైర్మన్ నారాయణమూర్తి ఇక ఫుల్స్టాఫ్ చెప్పాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బోర్డుతో నెలకొన్న ఫైటింగ్కు ఇక ఇక్కడితో స్వస్తి చెప్తామని నారాయణమూర్తి పేర్కొనట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల తలెత్తిన ప్రశ్నలపై కంపెనీ ఓ డీల్ చేపడుతుందని మూర్తి చెప్పినట్టు సమాచారం. ఇన్ఫోసిస్ కంపెనీ కార్పొరేట్ నైతిక ప్రమాణాలు(గవర్నెన్స్) దిగజారాయని స్వయాన నారాయణ మూర్తే పేర్కొనడంతో ఆ లుకలుకలు తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే.
సీఈఓ విశాల్ సిక్కాకు వేతన ప్యాకేజీని భారీగా పెంచడం, మరో ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు పెద్ద మొత్తంలో వీడ్కోలు ప్యాకేజీని ఆఫర్ చేయడంపై ఇన్ఫీ వ్యవస్థాపకులు అభ్యంతరం వ్యక్తం చేశారంటూ వార్తలు గుప్పుమనడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. అయితే, విశాల్ సిక్కా పనితీరుపై నారాయణమూర్తి పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ వ్యవహారం ఆయనకు సంబంధించింది కాదన్నారు.
'' ఇక ఇక్కడితో ఆపుద్దాం. కంపెనీ ఎక్కువగా వేతనాలు చెల్లించడం వ్యవస్థాపకుల్ని తికమకలో పడేసింది. ప్రస్తుతం దీనిని పరిష్కరించుకుద్దాం. నా దగ్గర సమయం లేదు. బోర్డు కాని, మేనేజ్మెంట్ కాని ఈ విషయంపై సమయం వెచ్చిచవద్దు'' అని మూర్తి చెప్పినట్టు రిపోర్టులు వస్తున్నాయి. వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య నెలకొన్న పరిస్థితులు వృద్ధిని మందగించేలా చేస్తాయని పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ కంపెనీపై ప్రభావం చూపుతుందని మూర్తి ఆందోళన వ్యక్తంచేశారట.. సహవ్యవస్థాపకుల కమ్యూనికేషన్లను హ్యాండిల్ చేయడానికి కంపెనీ ఓ న్యాయసంస్థను ఏర్పాటుచేసిన వెంటనే, మూర్తి సంధికి పిలుపునివ్వడం గమనార్హం.
Advertisement