ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి చెబుతున్నాయి. కరోనా తగ్గుముఖ పట్టడంతో సుధీర్ఘ కాలం ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న ఉద్యోగుల్ని కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమకు ప్రమోషన్‌లు వద్దని, వాటికి బదులు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని కోరుతూ బాస్‌లకు మెయిల్స్ పెడుతున్నారు. ఉద్యోగుల వెర్షన్ ఇలా ఉంటే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాత్రం భారతీయులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సరిపోదని అంటున్నారు.
ఇటీవల అన్నీ సంస్థలు వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగుల్ని ఆఫీస్‌కు రప్పిస్తున్నాయి. మరి కొన్ని సంస్థలు హైబ్రిడ్ వర్క్ మోడ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇవంతి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 71శాతం మంది ఉద్యోగులు తమకు ఆఫీస్ లో పనిచేయడం కంటే ఇంటి వద్ద నుంచి పనిచేయడాన్ని ఇష్టపడుతున్నట్లు తేలింది. అంతేకాదు అందుకోసం ప్రమోషన్‌లను కూడా వదులుకుంటున్నారు. తమకు ప్రమోషన్‌ల కంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ఇష్టమని, అందుకు సహకరించాలని ఉద్యోగులు సంస్థలకు పంపిస్తున్న మెయిల్స్‌లో పేర్కొంటున్నారు.
►ఇవంతి నివేదిక ప్రకారం.. 42శాతం మంది ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్‌తో సంతోషంగా ఉన్నారని, 30శాతం మంది శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయాలని అనుకుంటున్నారు.
►13 శాతం మంది మాత్రమే పూర్తిస్థాయిలో కార్యాలయానికి తిరిగి రావాలనుకుంటున్నారు.
►గూగుల్ ఉద్యోగులు వారానికి మూడు రోజులు తిరిగి కార్యాలయానికి రావాలని కోరుకుంటున్నారు
►గతేడాది 24 శాతం మంది ఉద్యోగాలకు రిజైన్ చేశారు.
►28 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో జాబ్ వదిలేసే ఆలోచనా ధోరణిలో ఉన్నారు. జాబ్ వదిలేసే వారి శాతం 36 పెరగ్గా..అందులో 25 నుంచి 34 మధ్య వయస్సున్న ఉద్యోగులు ఉన్నట్లు రిపోర్ట్ హైలెట్ చేసింది. ఈ సందర్భంగా ఇవంతి వ్యవస్థాపకుడు, సీఈఓ మేఘన్ బిరో మాట్లాడుతూ.. సంస్థలు ఎక్కడి నుంచైనా పనిచేసేలా ఉద్యోగులకు అత్యుత్తమ సాంకేతికను అమలు చేసేలా వ్యూహాలు అమలు చేయాలని అన్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు!
మరోవైపు వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్) పై తాజాగా ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ..ఇంటి వద్ద నుంచి పనిచేసే పద్దతి భారత్‌కు అనుకూలం కాదని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఉద్యోగుల ప్రొడక్టివిటీ దెబ్బతినడమే కాదు, సృజనాత్మకత, నైపుణ్యం, ప్రతిభను వెలికితీయడం, సంప్రదింపులు వంటి అంశాల్లో మెరుగుదల సాధించడం కష్టమని అన్నారు.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..!
Comments
Please login to add a commentAdd a comment