సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ప్రముఖ సినీ నటుడు, ప్రజా చిత్రాల దర్శకుడు ఆర్.నారాయణమూర్తికి సుద్దాల హనుమంతు–జానకమ్మ జాతీయ అవార్డు లభించింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతులమీదుగా ఆర్.నారాయణమూర్తికి ఈ అవార్డును ప్రదానం చేశా రు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హనుమంతు తన పాటల ద్వారా ప్రజల్లో సామా జిక చైతన్య స్ఫూర్తిని రగిలించారని కొనియాడారు. ప్రముఖ కవి కోయి కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. మాటల తోటమాలి సుద్దాల హనుమంతు అని ప్రశంసించారు. అనంతరం అవార్డు గ్రహీత నారాయణమూర్తి మాట్లాడుతూ.. ప్రజల నాలుకపై బతుకుతున్న ప్రజాకవి హనుమంతు పేరుమీద నాకు అవార్డునివ్వడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సభకు ముందు టంగుటూరి బండి సత్యనారాయణ కళాబృందంచే ప్రదర్శించిన ఎల్లమ్మ ఒగ్గు కథ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు, సంపాదకుడు కె.రామచంద్రమూర్తి, తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ అధ్యక్షుడు డాక్టర్ పేతిరెడ్డి రంగయ్య, సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, సుద్దాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment