suddala hanumanthu
-
ఆర్.నారాయణమూర్తికి జాతీయ అవార్డు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ప్రముఖ సినీ నటుడు, ప్రజా చిత్రాల దర్శకుడు ఆర్.నారాయణమూర్తికి సుద్దాల హనుమంతు–జానకమ్మ జాతీయ అవార్డు లభించింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతులమీదుగా ఆర్.నారాయణమూర్తికి ఈ అవార్డును ప్రదానం చేశా రు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హనుమంతు తన పాటల ద్వారా ప్రజల్లో సామా జిక చైతన్య స్ఫూర్తిని రగిలించారని కొనియాడారు. ప్రముఖ కవి కోయి కోటేశ్వర్రావు మాట్లాడుతూ.. మాటల తోటమాలి సుద్దాల హనుమంతు అని ప్రశంసించారు. అనంతరం అవార్డు గ్రహీత నారాయణమూర్తి మాట్లాడుతూ.. ప్రజల నాలుకపై బతుకుతున్న ప్రజాకవి హనుమంతు పేరుమీద నాకు అవార్డునివ్వడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సభకు ముందు టంగుటూరి బండి సత్యనారాయణ కళాబృందంచే ప్రదర్శించిన ఎల్లమ్మ ఒగ్గు కథ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు, సంపాదకుడు కె.రామచంద్రమూర్తి, తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ అధ్యక్షుడు డాక్టర్ పేతిరెడ్డి రంగయ్య, సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, సుద్దాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
10న యువ కవి సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాహితి, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 10న సుద్దాల హనుమంతు యాదిలో ‘నల్లమల యురేనియం తవ్వకాలపై యువ కవి సమ్మేళనం’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణ సాహితి ప్రతినిధులు భూపతి వెంకటేశ్వర్లు, జి.నరేష్, డీవైఎఫ్ఐ అధ్యక్షుడు విప్లవ కుమార్, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
సాయుధ పోరాట కవి
1944 నుంచి 1952 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఒక చేత్తో పెన్ను, మరో చేత్తో గన్ను పట్టి తన మాట, ఆట, పాటలతో ఊపిరులూదిన ప్రజాకవి, కళాకారుడు సుద్దాల హనుమంతు. నల్గొండ జిల్లా రామన్నపేట తాలూకా పాలడుగు గ్రామంలో 1908వ సంవత్సరంలో గుర్రం బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించాడు హనుమంతు. చిన్నప్పటినుంచి నాటకాలు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఒకవైపు పాటలు రాస్తూ, పాడుతూ, ప్రజలను చైతన్యపరుస్తూ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, కవిగా, కళాకారుడిగా, ఉద్యమనేతగా తన కలాన్ని, గళాన్ని వినిపించాడు. నాటి సాయుధపోరాటంలో రజాకార్లు ఊర్లపైబడి ప్రజల ధనమాన ప్రాణాలను దోచుకుపోతుంటే ముసలావిడ ఒక సభలో పలికిన మాటను ‘వెయ్ దెబ్బ’ పాటగా మలిచారు సుద్దాల. అది రజాకార్లను తరిమికొట్టిన పాటే. అలాగే 1946లో ‘పాలబుగ్గల జీతగాడ తలచుకుంటే దు:ఖమొచ్చిందా’ అంటూ సాగే గతం వెట్టిచాకిరిపై యుద్ధారావాన్ని ప్రకటించింది. 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభకు రావి నారాయణరెడ్డి సభాధ్యక్షత వహించగా లక్షలాది ప్రజల ఆర్తనాదాలను, తన భావాలకు జోడించి ఉద్యమ వలంటీర్‌గా ప్రజాపోరాటాల్లో గెలిచిన సుద్దాల కలం, గళం 1982 అక్టోబర్ 10న మూగబోయింది. ఆయన స్మృతి చిహ్నంగా ప్రజా ఉద్యమాలకు చిహ్నంగా వారి స్తూపాన్ని పెన్ను ఆకృతిలో నిర్మించారు. వారికి ఇవే ఉద్యమ జోహార్లు! (నేడు సుద్దాల హనుమంతు 36వ వర్ధంతి) -కందుల శివకృష్ణ, పరిశోధకులు, సుద్దాల హనుమంతు సాహిత్యం ‘ మొబైల్ : 99665 07875 -
రాజేశ్వరికి ‘సుద్దాల’ పురస్కారం
సిరిసిల్ల: రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా అంది స్తున్న సుద్దాల హన్మంతు జానకమ్మ పురస్కారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన కుమారి బూర రాజేశ్వరికి లభించింది. ఈ నెల 6న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ అధ్యక్షుడు సుద్దాల అశోక్‌తేజ ప్రకటించారు. రాజేశ్వరి అంగవైకల్యంతో బాధపడుతూ ఏడో తరగతి వరకు చదువుకున్నారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆమెకు చేతులు లేకపోవడంతో కాలుతోనే కవితలు రాస్తుంది. ఆమె గురించి తెలుసుకున్న ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ సిరిసిల్లకు వచ్చి కలిశారు. ‘సంకల్పం ముందు వైకల్యం ఎంత.. దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత.. ఎదురీత ముందు విధిరాత ఎంత.. పోరాటం ముందు ఆరాటం ఎంత’ అంటూ రాజేశ్వరి సా హిత్యాన్ని అశోక్‌తేజ కవిత్వీకరించారు. రాజేశ్వరి కవితలను సుద్దాల ఫౌండేషన్ ద్వారా ముద్రిం చారు. ఆ పుస్తకాన్ని సిరిసిల్ల రాజేశ్వరి కవిత్వం గా జనవరి 6న రవీంద్రభారతి వేదికగా ఆవిష్కరిస్తున్నారు. ఈ పుస్తకానికి డాక్టర్ సినారె ముందు మాట రాశారు. పుస్తక ఆవిష్కరణోత్సవంలో సినారె, ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభు త్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, సినీ నట దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి, నటుడు ఉత్తేజ్, ప్రజాగాయని సుద్దాల భారతి పాల్గొంటారని సుద్దాల ఫౌండేషన్ పేర్కొంది. సుద్దాల హన్మంతు పురస్కారాలను ఇప్పటివరకు ప్రముఖ సినీ దర్శక నిర్మాత బి.నర్సింగరావు, ప్రజాగాయకుడు గద్ద ర్, పద్మభూషన్ డాక్టర్ తీజన్బాయ్, కెన్యా దేశ రచయిత ప్రొఫెసర్ ఎన్.గుగి వాథియాంగో అందుకున్నారు.