నవాజ్ షరీఫ్ ను స్కూల్ పిల్లాడిలా చూశారు: ఇమ్రాన్ ఖాన్
నవాజ్ షరీఫ్ ను స్కూల్ పిల్లాడిలా చూశారు: ఇమ్రాన్ ఖాన్
Published Mon, Jun 2 2014 8:46 PM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై క్రికెటర్, పాకిస్థాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. భారత పర్యటనలో నవాజ్ తన హోదాను మరిచి, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టారని ఇమ్రాన్ ఆరోపించారు.
అంతేకాక నవాజ్ ను భారత్ లో ఓ స్కూల్ పిల్లాడిలా చూశారని ఇమ్రాన్ ఎద్దేవా చేశారు. దేశ ప్రయోజనాలను భంగ పరిచే విధంగా ఉక్కు వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్ ఆతిధ్యాన్ని ఎలా స్వీకరిస్తారని ఇమ్రాన్ ప్రశ్నించారు.
తన కుమారుడు హసన్ నవాజ్ తో కలిసి సజ్జన్ జిందాల్ ఇంటికి నవాజ్ వెళ్లడాన్ని ఇమ్రాన్ తప్పుపట్టారు. సజ్జన్ జిందాల్ ఇంటికి వెళ్లడానికి సమయాన్ని కేటాయించిన నవాజ్.. హరియత్ నేతలతో సమావేశానికి ఆసక్తి చూపలేదన్నారు. పాకిస్థాన్ దేశ ప్రయోజనాలను నవాజ్ పక్కన పెట్టారని ఇమ్రాన్ మండిపడ్డారు.
Advertisement