ఆ ఫోన్లపై అమెజాన్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్స్
ఆ ఫోన్లపై అమెజాన్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్స్
Published Mon, Jun 26 2017 12:56 PM | Last Updated on Fri, May 25 2018 7:14 PM
కూల్ ప్యాడ్ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ డిస్కౌంట్లను, ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటించింది. క్యూల్ ప్యాడ్ కూల్1 డ్యూయల్, కూల్ ప్యాడ్ నోట్5, కూల్ ప్యాడ్ నోట్5 లైట్ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ ఈ ఆఫర్లను అందిస్తున్నట్టు తెలిసింది. 3జీబీ, 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగిన కూల్ ప్యాడ్ కూల్1 డ్యూయల్ స్మార్ట్ ఫోన్ ను రూ.9999కే అమెజాన్ అందిస్తోంది. దీని అసలు ధర 11,999రూపాయలు.
అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ పై 7,712 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందిస్తోంది. ఇదే స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ కూడా అమెజాన్ ప్లాట్ ఫామ్ పై రూ.11,999కు దొరుకుతోంది. ఇది లాంచింగ్ సమయంలో 14,999రూపాయల ధర కలిగి ఉంది. దీనిపై కూడా గరిష్టంగా 9,412రూపాయల వరకు ఎక్స్చేంజ్ ను ఆఫర్ చేస్తోంది. 3జీబీ, 4జీబీ వేరియంట్లలో కూల్ ప్యాడ్ కూల్1 డ్యూయల్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు వేరియంట్లకు వెనుకవైపు రెండు కెమెరాలు కలిగిఉన్నాయి.
కూల్ ప్యాడ్ నోట్5(32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఫోన్)ను 9,999రూపాయలకు అమెజాన్ తన ప్లాట్ ఫామ్ పై విక్రయిస్తోంది. 5.5అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ ప్లే, 4010 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్ అసలు ధర 10,999 రూపాయలు. అంతేకాక ఎక్స్చేంజ్ పై 7,712 రూపాయల వరకు డిస్కౌంట్ ను అమెజాన్ అందుబాటులో ఉంచింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లపైనే కాకుండా కూల్ ప్యాడ్ నోట్5 లైట్ ను డిస్కౌంట్ ధరలో 7,499 రూపాయలకు విక్రయిస్తోంది. దీని అసలు ధర 8,999 రూపాయలు. కానీ ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అయినట్టు తెలిసింది.
Advertisement
Advertisement