ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ రూ. 10,000 కోట్లు!
11 కోట్ల షేర్లు(20–25% వాటా) జారీ
పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి దరఖాస్తు..
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలని ఎన్‌ఎస్‌ఈ భావిస్తోంది. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానున్నది. ఈ ఐపీఓలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలో 20–25 శాతం వాటా(సుమారుగా 11 కోట్ల షేర్ల)ను ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం వాటా కలిగిన సంస్థలు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనున్నాయి. ఎన్‌ఎస్‌ఈ విలువ రూ.50,000–55,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐపీఓ ప్రక్రియ కోసం ఒక లిస్టింగ్ కమిటీని కూడా ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటు చేసింది. ఐపీఓ సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ చిత్ర రామకృష్ణ అనూహ్యంగా రాజీనామా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి ఎన్‌ఎస్‌ఈ రూ.588 కోట్ల నికర లాభాన్ని, రూ.1,344 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది.
బీఎస్‌ఈ కూడా...
బీఎస్‌ఈ కూడా ఐపీఓ పత్రాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే సెబీకి సమర్పించింది. రూ.1,500 కోట్లు సమీకరించాలనేది ప్రణాళిక. బీఎస్‌ఈ ప్రమోట్ చేసిన సీడీఎస్‌ఎల్(సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్) కూడా తాజాగా ఐపీఓ పత్రాలను దాఖలు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్)...భారత్‌లో ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో లిస్టయిన స్టాక్ ఎక్సే్చంజ్ ఇదొక్కటే.