అమరావతి ఇటుక ధర రూ.10
‘మై బ్రిక్-మై అమరావతి’ వెబ్‌సైట్ ప్రారంభం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి నిర్మాణంలో అందరి సహకారం తీసుకొనేందుకు ఈ-బ్రిక్స్ పోర్టల్ ప్రారంభమైంది. ‘మై బ్రిక్-మై అమరావతి’ పేరుతో ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. ఒక డిజిటల్ ఇటుక ధర రూ.10గా నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఇటుకనైనా విరాళంగా ఇచ్చేందుగా వీలుగా ఈ ఆన్‌లైన్ ఇటుకల అందజేత విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఎవరైనా రూ.10 చెల్లించి ఒక డిజిటల్ ఇటుకను కొనుగోలు చేయవచ్చు. ఈ సొమ్మును రాజధాని నిర్మాణానికి ఖర్చు చేసా ్తరు. అమరావతి ఇటుకను కొనుగోలు చేసిన వారికి సీఎం సంతకంతో ఉన్న సర్టిఫికెట్‌ను పంపిం చాలని నిర్ణయించారు. ఠీఠీఠీ.్చఝ్చట్చఠ్చ్టిజీ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో కి వెళ్లి డిజిటల్ ఇటుకలను కొనుక్కోవచ్చు. వెబ్‌సైట్ ప్రారంభించిన తర్వాత ఏపీ సీఆర్‌డీఏ అధికారులు, ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.5.22 లక్షలతో 52 వేల ఈ-బ్రిక్స్‌ను కొనుగోలు చేశారు. సింగపూర్‌కు చెందిన శ్రీనివాస్ 108 ఇటుకలను కొనుగోలు చేశారు. తొలిరోజు సాయంత్రం 7 గంటల వరకూ 72 మంది 62,576 ఈ-బ్రిక్స్‌ను కొనుగోలు చేశారు.
శంకుస్థాపన ఖర్చు రూ.10 కోట్లే
రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకు రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నామనడం నిజం కాదని, రూ.10 కోట్లతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ చెప్పారు. వారు గురువారం విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద మా ట్లాడారు. విమానాలు, హెలికాప్టర్లను చాలామంది స్పాన్సర్ చేస్తున్నారని, వాటికి హెలిప్యాడ్‌లు, పార్కింగ్ వసతిని మాత్రమే ప్రభుత్వం సమకూరుస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం తరుపున కేవలం ఒకట్రెండు విమానాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నామన్నారు.
జగన్‌ను సీఎం స్వయంగా ఆహ్వానిస్తారు
రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరపున ప్రభుత్వం ఆయనను ఆహ్వానిస్తుందని చెప్పారు.