రైతు ఉద్యమ నేత ‘యెర్నేని’ మృతి | Farmer Movement Leader 'Yerneni' Passed Away | Sakshi
Sakshi News home page

రైతు ఉద్యమ నేత ‘యెర్నేని’ మృతి

Published Fri, Sep 29 2023 5:57 AM | Last Updated on Fri, Sep 29 2023 5:57 AM

Farmer Movement Leader 'Yerneni' Passed Away - Sakshi

సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు, కృష్ణా, గోదావరి, పెన్నార్‌ డెల్టా డ్రెయినేజీ బోర్డు మాజీ సభ్యుడు యెర్నేని నాగేంద్రనాథ్‌ (చిట్టిబాబు) (78) తన స్వగ్రామమైన ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరులో కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం మెదడుకు శస్త్రచికిత్స జరిగి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇంటికి తీసుకొచి్చన తర్వాత  గురువారం తుదిశ్వాస విడిచారు.

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు భార్య యెర్నేని సీతాదేవి మాజీ మంత్రిగా పనిచేశారు. సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్‌ రెండు పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. కొల్లేరు ముంపు సమస్యలపై పూర్తి అధ్యయనం చేశారు. ప్రముఖ రైతు ఉద్యమకారులతో కలసి అనేక ఉద్యమాలు చేశారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై పూర్తి పట్టు కలిగిన వ్యక్తిగా పేరుంది.

కైకలూరులో వీరి తండ్రి యెర్నేని వెంకట నాగేశ్వరరావు (వైవీఎన్నార్‌) పేరుతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉంది. ఆయన మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు నివాళులరి్పంచారు. చిన్న కుమారుడు అమెరికాలో ఉండడంతో శుక్రవారం అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement