
రెనాల్ట్ క్విడ్ కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంత?
న్యూఢిల్ల్లీ: ఫ్రెంచ్ బ్రాండ్ ఆటో మేకర్ రెనాల్ట్ ఇండియా సరికొత్త వెర్షన్‌లో తన హ్యాచ్ బ్యాక్ కారు 'క్విడ్' కొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ 3.54 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. క్విడ్ ఆర్‌ఎక్స్‌ఎల్ 1.0 లీటర్ ఎస్‌సీఈ (స్మార్ట్ కంట్రోల్ ఎఫీషియన్సీ) పేరుతో దీన్ని గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్ మాన్యువల్, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెర్షన్ లో అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెర్షన్ క్విడ్ ధర రూ. 3.84లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా ఉండనుంది. ఫీచర్లు, ట్రాన్స్‌మిషన్ ఆధారంగా దీని గరిష్ట ధర రూ. 4.32 లక్షలుగా ఉండనుందని కంపెనీ పేర్కొంది.
ఇండియాలో తమ మార్కెట్‌ను మరింత విస్తరించుకోడానికి ఫ్రెంచ్ ఆటో దిగ్గజం ఈ కొత్త వేరియంట్ ద్వారా తమ మార్కెట్‌ను స్థిరీకరించాలని భావిస్తున్నట్టు రెనాల్ట్ ఇండియా సిఇఓ, ఎండి సుమిత్ సాహ్నీ తెలిపారు. ముఖ్యంగా టైర్ II-IV లో మార్కెట్లలో వినియోగదారులకు మరింత అందుబాటులోకి యోచనలో ఉన్నట్టు చెప్పారు.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే..
- 1.0 లీటర్ ఎస్‌సీఈ ఇంజన్ సామర్థ్యం
- డోర్స్‌పై న్యూ స్పీడ్ స్పోర్ట్స్ గ్రాఫిక్స్
- టు-టోన్ ఓఆర్‌వీఎంఎస్
- 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్
- క్విడ్ ఏఎంటీ వెర్షన్ లో 1.0 లీటర్ ఇంజన్ సహా దాదాపు ఇవే ఫీచర్స్ ఉన్నాయి.