ఈ స్కూటర్ ధర.. రూ. 12 లక్షలు!
ఒకప్పుడు భారతదేశంలో స్కూటర్ అంటే.. బజాజ్ చేతక్ మాత్రమే. ఆ తర్వాత ఎల్ఎంఎల్ వెస్పా వచ్చింది. అప్పట్లో అదో సంచలనం. మంచి లుక్‌తో, డిఫరెంట్ స్టైలుతో ఉన్న ఆ స్కూటర్‌ను బాగానే ఆదరించారు. కొన్నాళ్ల పాటు వినిపించని వెస్పా పేరు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. వెస్పా 946 ఎంపోరియో అర్మానీ పేరుతో ఇప్పుడు విడుదల చేసిన ఈ స్కూటర్ ధర.. ఏకంగా రూ. 12 లక్షల పైమాటే. దానికి మళ్లీ పన్నులు అదనం. జార్జియో అర్మానీ 40వ వార్షికోత్సవం, పియాజియో గ్రూపు 130వ వ్యవస్థాపక దినం సందర్భంగా గత సంవత్సరం ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ప్రీమియం మోడల్‌తో పాటు, వెస్పా 70వ వార్షికోత్సవ ఎడిషన్‌ను కూడా రూ. 96,500 ధరతో విడుదల చేసింది.
దేశంలో ఇది రెండో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా నిలుస్తుంది. ఏప్రియాలా ఎస్ఆర్‌వి 850 ఏబీఎస్ అనేది ఇప్పటివరకు దేశంలో అత్యంత ఖరీదైన స్కూటర్. దాని ధర రూ. 14.39 లక్షలు. ఇప్పుడు విడుదల చేసిన వెస్పా ప్రీమియం స్కూటర్ లుక్ కూడా చాలా విభిన్నంగా ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్‌కు భారతదేశం నుంచి రెండు ఆర్డర్లు వచ్చాయి. స్కూటర్ల టెక్నాలజీలో దీనిది అత్యంత ఆధునికమైనదని చెబుతున్నారు. హెడ్‌లైట్ పైన గద్ద లోగో ఉంటుంది. హెడ్ ల్యాంప్, టైల్ లైట్, ఇండికేటర్లు అన్నీ ఎల్‌ఈడీవే. దీనికి 125 సీసీ సింగిల్ సిలిఒడర్ ఇంజన్ ఉంటుంది. 11.7 బీహెచ్‌పీ పవర్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటాయి. అంటే గేర్లను మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. 220 ఎంఎం డబుల్ డిస్క్ బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ మరియు ఏఎస్ఆర్ నియంత్రణలు ఉంటాయి. వెస్పా డీలర్లతో పాటు పియాజియో మోటోప్లెక్స్ షోరూంలలో కూడా ఇవి లభ్యమవుతాయి. ఇవి లిమిడెట్ ఎడిషన్.. అంటే కొన్ని మాత్రమే తయారుచేస్తారు. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.